వీడియో: సస్పెన్స్​కు తెర.. MI క్యాంపులోకి సింహంలా ఎంట్రీ ఇచ్చిన రోహిత్!

ముంబై ఇండియన్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో ఇక టెన్షన్ పడనక్కర్లేదు.

ముంబై ఇండియన్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో ఇక టెన్షన్ పడనక్కర్లేదు.

స్వదేశంతో పాటు విదేశాల నుంచి కూడా ప్లేయర్లు అందరూ వచ్చేశారు. కోచింగ్ స్టాఫ్ కూడా ఎప్పుడో టీమ్​తో జాయిన్ అయిపోయారు. కొత్త కెప్టెన్ కూడా కొబ్బరి కాయ కొట్టి సీజన్​ను స్టార్ట్ చేశాడు. అయితే ఇంతమంది వచ్చినా.. అందరి చూపులు మాత్రం అతనొక్కడి మీదే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఆ స్టార్ ప్లేయర్ టీమ్​లోకి ఎంట్రీ ఇస్తాడా? అని అందరూ ఎదురు చూడసాగారు. ఆటగాళ్లు అంతా ఒకే చోట కలసి ప్రాక్టీస్ చేస్తున్నా అతడు లేకపోవడంతో బోసిపోయినట్లుగా ఉంది. అంతలా ఆ ఫ్రాంచైజీ మీద ప్రభావం చూపే ఆ ప్లేయర్ ఎట్టకేలకు వచ్చేశాడు. సింహంలా టీమ్ క్యాంప్​లో జాయిన్ అయ్యాడు. అతడు మరెవరో కాదు.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఔను, రోహిత్ వచ్చేశాడు.

ఐపీఎల్ కొత్త సీజన్ కోసం రోహిత్ ఆగమనం ఇవాళే జరిగింది. వస్తాడా? రాడా? ఆడతాడా? ఆడడా? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ, సస్పెన్స్​కు తెరదించుతూ ఎట్టకేలకు ముంబై క్యాంపులో చేరాడు హిట్​మ్యాన్. అతడి రాకకు సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది ముంబై ఫ్రాంచైజీ. ‘అతను వచ్చేశాడు. ఎవర్నీ గార్డెన్స్​లో తిరగకుండా చేసేవాడు. పుల్ షాట్​తో బంతుల్ని స్టేడియం బయటకు పంపేవాడు వచ్చేశాడు’ అంటూ ఇద్దరు కుర్రాళ్లతో రోహిత్ ఎంట్రీ గురించి ఘనంగా చెప్పించింది ముంబై. కారులో నుంచి దిగిన హిట్​మ్యాన్ హోటల్ కిటికీలో నుంచి సమీపంలో ఉన్న సముద్రాన్ని చూస్తూ సీరియస్​ లుక్​లో దర్శనమిచ్చాడు. రోహిత్ ఆగమనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

రోహిత్ ఎంట్రీ వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. హిట్​మ్యాన్ ఆగమనం అదిరిందని.. అతడు సింహంలా ఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు. స్టైలిష్ లుక్​లో, గంభీరంగా అతడు నడుచుకుంటూ వస్తుంటే గూస్​బంప్స్ వస్తున్నాయని అంటున్నారు. గ్రౌండ్​లో బ్యాట్​తో రోహిత్ సృష్టించే బీభత్సం కోసం ఎదురు చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, రోహిత్ ఎంట్రీతో ముంబై మేనేజ్​మెంట్, అందరికంటే ముఖ్యంగా కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఊపిరి పీల్చుకున్నాడు. హిట్​మ్యాన్ వస్తాడో రాడోననే డౌట్స్ ఏర్పడ్డ నేపథ్యంలో ఎట్టకేలకు ఎంట్రీ ఇవ్వడంతో కూల్ అయిపోయాడు. కాగా, కొన్ని రోజుల కింద తాను ఈ సీజన్​లో ఆడట్లేదని, ఏడాది కాలంగా ఊపిరి సలపని క్రికెట్​తో అలసిపోయానంటూ రోహిత్ ఇన్​స్టాలో ఓ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే పెట్టిన కొన్ని క్షణాల్లోనే దాన్ని అతడు డిలీట్ చేసేశాడు. మరి.. రోహిత్ ఎంట్రీపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments