చరిత్ర సృష్టించిన జైస్వాల్.. కోహ్లీ రికార్డు బ్రేక్!

ఇంగ్లండ్​తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. కింగ్ కోహ్లీ రికార్డును అతడు బ్రేక్ చేశాడు.

ఇంగ్లండ్​తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. కింగ్ కోహ్లీ రికార్డును అతడు బ్రేక్ చేశాడు.

ధర్మశాల టెస్టులో టీమిండియా సూపర్బ్​గా ఆడుతోంది. రియల్ బజ్​బాల్ అంటే ఏంటో ఇంగ్లండ్​కు మరోమారు చూపిస్తూ చెలరేగుతోంది. పిచ్ బ్యాటింగ్​కు సహకరిస్తుందని భావించిన ప్రత్యర్థి జట్టు సారథి బెన్ స్టోక్స్ టాస్ నెగ్గాక బ్యాటింగ్​ ఎంచుకున్నాడు. కానీ అతడి డిసిషన్ రాంగ్ అని తేలేందుకు ఎక్కువ టైమ్ పట్టలేదు. ఈ వికెట్ మీద జరిగిన గత కొన్ని ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో పిచ్ పేస్​కు అనుకూలించడంతో సీమర్స్ చెలరేగారు. దాదాపుగా వికెట్లన్నీ వారికే దక్కాయి. కానీ ఇంగ్లండ్​-భారత్ టెస్టులో మాత్రం ధర్మశాల వికెట్ అనూహ్యంగా స్పిన్​కు సహకరించింది. దీంతో టీమిండియా స్పిన్నర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాదవ్ (5/72), రవిచంద్రన్ అశ్విన్ (4/51) ఇంగ్లండ్​ వెన్ను విరిచారు. వీళ్లిద్దరి దెబ్బకు ఆ జట్టు 218 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. ఈ క్రమంలో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.

కెప్టెన్ రోహిత్​ శర్మ (30 నాటౌట్)తో కలసి ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేసిన జైస్వాల్ (27) అటాకింగ్ గేమ్​తో అదరగొడుతున్నాడు. అతడు చేసిన 27 పరుగుల్లో 18 పరుగులు సిక్సుల ద్వారానే వచ్చాయి. దీన్ని బట్టే అతడి బ్యాట్ ఎలా గర్జిస్తోందో అర్థం చేసుకోవచ్చు. అయితే 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడీ యంగ్ బ్యాటర్. ఇంగ్లండ్ మీద ఒక టెస్టు సిరీస్​లో అత్యధిక రన్స్ చేసిన భారత ప్లేయర్​గా జైస్వాల్ (656 పరుగులు) నిలిచాడు. ఇంతకుమందు ఈ రికార్డు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (655) పేరిట ఉండేది. 2016-17లో జరిగిన టెస్టు సిరీస్​లో కోహ్లీ ఈ రికార్డు నెలకొల్పాడు. అయితే ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్​కు చేరుకున్నాడు జైస్వాల్.

ఈ లిస్టులో వీళ్లిద్దరి తర్వాతి స్థానాల్లో రాహుల్ ద్రవిడ్ (602), విజయ్ మంజ్రేకర్ (586) ఉన్నారు. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టడంతో జైస్వాల్​ను సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. విరాట్ బాటలోనే అతడు నడుస్తున్నాడని అంటున్నారు. ఇలాగే ఆడుతూ పోతే కోహ్లీ, సచిన్ సాధించిన మరిన్ని రికార్డులను అతడు బ్రేక్ చేయగలడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్​ ఫస్ట్ ఇన్నింగ్స్​లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన భారత్ ప్రస్తుతం 12 ఓవర్లకు 57 పరుగులతో ఉంది. జైస్వాల్​తో పాటు రోహిత్ క్రీజులో ఉన్నాడు. మరి.. కోహ్లీ రికార్డును జైస్వాల్ బ్రేక్ చేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మోడ్రన్ మాస్టర్స్​కు మొగుడు.. క్రికెట్​ను ఏలుతున్న బ్యాటర్లకు పీడకలగా జడ్డూ!

Show comments