Team India: పెప్సీ, కోక్ కాదు.. ఇక భారత జెర్సీలపై కాంపా.. ఇది అంబానీ సాఫ్ట్ డ్రింక్!

భారత క్రికెట్ జట్టు స్పాన్సర్లు మారారు. ఇక మీదట టీమిండియా జెర్సీలపై కాంపా కనిపించుంది. అంబానీలకు చెందిన ఈ సాఫ్ట్ డ్రింక్ గురించి మరిన్ని విశేషాలు మీ కోసం..

భారత క్రికెట్ జట్టు స్పాన్సర్లు మారారు. ఇక మీదట టీమిండియా జెర్సీలపై కాంపా కనిపించుంది. అంబానీలకు చెందిన ఈ సాఫ్ట్ డ్రింక్ గురించి మరిన్ని విశేషాలు మీ కోసం..

పెప్సీ, కోకా కోలా.. ఈ సాఫ్ట్ డ్రింక్స్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాల్లోనూ అమ్ముడవుతున్న సాఫ్ట్ డ్రింక్స్ ఇవి. మార్కెట్​లో ఎన్నో రకాల కొత్త సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్స్ వస్తున్నా ఏదీ వీటి ముందు నిలబడటం లేదు. అందుకు టేస్ట్ ఒక రీజన్ అయితే మరొకటి అడ్వర్టయిజ్​మెంట్. పెప్సీ, కోలా ఉత్పత్తులు అరుదైన రుచిని కలిగి ఉండటంతో వీటిని ఎక్కువగా తాగుతుంటారు. అదే టైమ్​లో తమ డ్రింక్ కంటే గొప్పది ఏదీ లేదంటూ ఈ రెండు కంపెనీలు భారీగా ప్రచారాన్ని చేస్తుంటాయి. క్రికెటర్లు, సినీ స్టార్లను తమ అంబాసిడర్లుగా పెట్టుకుంటాయి. అందుకే వీటిని సామాన్యుల వరకు ఈజీగా తీసుకెళ్లగలిగాయి. అయితే వీటికి చెక్ పెట్టేందుకు అపర కుబేరుడు ముకేశ్ అంబానీ రంగంలోకి దిగుతున్నారు. తన సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కాంపాను బరిలోకి దింపుతున్నారు. ఇందులో భాగంగా టీమిండియా స్పాన్సర్​షిప్​ను దక్కించుకున్నారు.

భారత క్రికెట్ జట్టుకు కొత్త స్పాన్సర్లను ప్రకటించింది బీసీసీఐ. టీమిండియా అధికారిక భాగస్వాములుగా ముకేశ్ అంబానీకి చెందిన కాంపాతో పాటు ఆటంబర్గ్ టెక్నాలజీస్ వ్యవహరించనున్నాయి. 2024 నుంచి 2026 వరకు ఆయా సంస్థలు హోమ్ సీజన్​ మ్యాచులకు స్పాన్సర్లుగా ఉంటాయని భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటిదాకా టీమిండియాకు డ్రీమ్ ఎలెవన్ సంస్థ స్పాన్సర్​గా ఉంది. ఇప్పుడు కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ రావడంతో భారత ప్లేయర్ల జెర్సీలు మారనున్నాయి. ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​లో మన క్రికెటర్లు కొత్త జెర్సీలతోనే గ్రౌండ్​లోకి దిగనున్నారు. ఇక, స్పాన్సర్లలో ఒకటైన ఆటంబర్గ్ టెక్నాలజీస్ గృహోపకరణాలను అందిస్తోంది. ఫ్యాన్లు, మిక్సీల వంటి ఉత్పత్తులను రూపొందిస్తోంది. మరో సంస్థ అయిన కాంపా అనేది రిలయన్స్ ఆధ్వర్యంలోని కన్స్యూమర్ ప్రొడక్ట్. ఇది పలు వేరియంట్లలో లభించే సాఫ్ట్ డ్రింక్.

ఇటీవల కాలంలో బాగా పాపులర్ అవుతున్న కాంపా.. ఇప్పుడు ఏకంగా భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్​గా సెలక్ట్ అయింది. దీంతో క్రికెటర్ల జెర్సీల మీదే కాదు.. స్టేడియాలు, మ్యాచులు జరిగే అన్ని వేదికల పైనా కాంపా మాత్రమే పొంగుతుంది. ఇక మీదట ఈ బ్రాండ్ యాడ్స్ అన్ని రకాల మీడియా వేదికల మీద దుమ్ము దులపడం ఖాయం. ఇప్పటికే ఎయిర్​పోర్ట్​లతో పాటు సొంత రీటెయిల్ స్టోర్స్​లో కాంపాను ప్రవేశపెట్టిన ముకేశ్ అంబానీ.. తదుపరి ఇతర రీటెయిల్ ఛానెళ్ల ఒప్పందాలతోనూ దూసుకుపోనున్నారు. ఇది ఒకరకంగా పెప్సికో, కోకాకోలాకు షాక్ అనే చెప్పాలి. భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్​గా సెలక్ట్ అవడం అంటే మాటలు కాదు కదా. మార్కెట్​లోకి తాను వస్తున్నాను, కాచుకోమని పోటీదారులకు ముకేశ్ వార్నింగ్ ఇస్తున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ రంగంలో అంబానీల కాంపా ఎంతమేర ప్రభావం చూపిస్తుందో చూడాలి. మరి.. టీమిండియా స్పాన్సర్​షిప్​ను కాంపా దక్కించుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: కొడుకుతో వాచ్​మన్​కు క్షమాపణలు చెప్పించిన ముకేశ్ అంబానీ!

Show comments