Revanth Reddy-AP: AP తో స్నేహపూర్వక బంధాన్ని కోరుకుంటున్న రేవంత్..!

AP తో స్నేహపూర్వక బంధాన్ని కోరుకుంటున్న రేవంత్..!

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. పొరుగు రాష్ట్రమైన ఏపీతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటన్నట్లు అర్థం అవుతోంది. ఇది మంచి పరిణామం అటున్నారు విశ్లేషకులు. ఆ వివరాలు..

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. పొరుగు రాష్ట్రమైన ఏపీతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటన్నట్లు అర్థం అవుతోంది. ఇది మంచి పరిణామం అటున్నారు విశ్లేషకులు. ఆ వివరాలు..

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. పొరుగు రాష్ట్రమైన ఆంధప్రదేశ్ తో.. ఆరోగ్యకరమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రగతిలో ఇతర రాష్ట్రాల మద్దతు, సహకారాన్ని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్వీట్ చేశారు. దీనికి రేవంత్ ధన్యవాదాలు తెలుపుతూ.. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తమ ప్రభుత్వం ఆకాంక్షిస్తోందంటూ ట్వీట్ చేశారు.

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7, గురువారం నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా రేవంత్ కి శుభకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం జగన్. వీరు ట్వీట్లు వైరల్ కాగా.. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగాలంటూ నెటిజనులు కామెంట్స్ చేశారు. వాస్తవంగా చూసుకున్నా రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగడం.. ఇరువురికి శ్రేయస్కరమే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికి కూడా.. రెండు ప్రాంతాల మధ్య కొన్ని వివాదాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ, శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ ల నిర్వహణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం కూడా అలానే మిగిలిపోయింది. అలానే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ 9, 10లో చేర్చిన సంస్థలకు సంబంధించిన వివదాలు పరిష్కారం కావాలి. వీటితో పాటు రెండు రాష్ట్రాల మధ్య బ్యాంకు ఖాతాలు, ఇతర సమస్యలు కూడా పరిష్కారం కావాల్సి ఉంది.

గతంలో ఈ సమస్యల పరిష్కారం కోసం.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కరించాల్సిన సమస్యలపై చర్చించారు. కానీ ఎలాంటి పరిష్కారం లేకుండానే అవి ముగిసాయి. అలానే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర ప్రభుత్వం నాలుగు సార్లు సమావేశాలు నిర్వహించింది. సమస్యల పరిష్కారంలో ప్రతిసారీ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. దాంతో ఇప్పటి వరకు.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు అలానే ఉండిపోయాయి.

రాష్ట్ర విభజన జరిగి 2024 జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ముఖ్యమంత్రులు ఏం చేస్తారో చూడాలి అంటున్నారు రాజకీయ పండితులు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. అదేంటి అంటే.. రాష్ట్ర విభజన సమయంలో.. హైదరాబాద్ ను పదేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించింది కేంద్రం. ఆ గడువు జూన్ 2, 2024 నాటికి ముగియనుంది. దాంతో ఆ లోపే రెండు డు రాష్ట్రాలు ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి అంటున్నారు నిపుణులు. మరి ఈ ఇద్దరు సీఎంలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని జనాలు ఎదురు చూస్తున్నారు.

Show comments