OTT Suggestions - Murder Mystery : ఒక మర్డర్ 9 మంది హంతకులు.. OTT లో నిమిషానికో ట్విస్ట్ తో కిక్ ఇచ్చే మూవీ

ఒక మర్డర్ 9 మంది హంతకులు.. OTT లో నిమిషానికో ట్విస్ట్ తో కిక్ ఇచ్చే మూవీ

OTT Murder Mystery : ఓటీటీ లో ఇప్పటివరకు ఎన్నో మర్డర్ మిస్టరీ మూవీస్ చూసి ఉంటారు. అయితే ఓ మర్డర్ జరిగిన తర్వాత దానిని ఎవరు చంపారో తెలుసుకోవడం కోసం ఇన్విటేషన్స్ పంపిస్తే.. ఎలా ఉంటుంది. మరి ఇలాంటి మూవీని మీరు చూశారా లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Murder Mystery : ఓటీటీ లో ఇప్పటివరకు ఎన్నో మర్డర్ మిస్టరీ మూవీస్ చూసి ఉంటారు. అయితే ఓ మర్డర్ జరిగిన తర్వాత దానిని ఎవరు చంపారో తెలుసుకోవడం కోసం ఇన్విటేషన్స్ పంపిస్తే.. ఎలా ఉంటుంది. మరి ఇలాంటి మూవీని మీరు చూశారా లేదో ఓ లుక్ వేసేయండి.

మర్డర్ మిస్టరీస్ అంటే మరింత ఆసక్తి చూస్తూ ఉంటారు. ఆ హత్య చేసింది ఎవరు ఎందుకు చేశారు.. దాని వెనుక కారణాలేంటి చివరికి ఏం జరిగింది ఇలాంటివి తెలుసుకోవాలంటే.. ప్రేక్షకులకు ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. మరి దానికి సస్పెన్స్ తోడైతే.. అది ఇంకాస్త ఎక్సయిట్మెంట్ పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఇక్కడ ఏకంగా ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఓ ఆరుగురికి లెటర్స్ పంపించి మరి ఇన్విటేషన్ పంపించి మరి ఆహ్వానిస్తారు. ఇక క్లైమాక్స్ లో అయితే బుర్ర పాడయ్యే ట్విస్ట్ లు ఉంటాయి. మరి ఈ సినిమా ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా ఓపెనింగ్ లో ఓ ప్యాలస్ ను చూపిస్తారు.. అందులో ఒక అతను ప్రాణ భయంతో పరిగెడుతూ ఉంటాడు. అతనిని వెనుక నుంచి ఒక అతను వచ్చి చంపేస్తాడు. ఆ పొడిచిన కత్తి పాతకాలం నాటి కత్తి. కట్ చేస్తే ఇక్కడ ప్రెసెంట్ చూపిస్తారు. ఇక్కడ హీరోయిన్ ఓ ఫ్లవర్ షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఆమెకు నొవెల్స్ చదవడం అంటే ఇష్టం. దీనితో ఆమెకు కాస్త డిటెక్టీవ్ బ్రెయిన్ అనేది చాలా ఉంటుంది. ఎవరు ఏ పనిని ఎప్పుడు ఎందుకు చేస్తున్నారో ఆమె వెంటనే పసిగడుతూ ఉంటుంది. దీనితో హీరోయిన్ ఓ రోజు ఇంటికి వెళ్లే టైమ్ కు ఓ లెటర్ వస్తుంది. అది ఓ బిజినెస్ మ్యాన్ పంపిన లెటర్ .. మీరు పలానా ఐలాండ్ కు రావాలని రాసి ఉంటుంది ఆ లెటర్ లో.. అలా ఆ బిజినెస్ మ్యాన్ మొత్తం ఆరుగురుకి ఆ లెటర్ పంపిస్తాడు.

కట్ చేస్తే ఈ ఆరుగురు కూడా ఆ బిజినెస్ మ్యాన్ రమ్మన్న ఐలాండ్ కు వెళ్తారు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత ఆ బిజినెస్ మ్యాన్ మాత్రం కనిపించడు. ఇక ఆ ఆరుగురిలో హీరోయిన్ కాకుండా ఓ లాయర్ , జర్నలిస్ట్, హోటల్ లో పని చేసే అమ్మాయి , డాక్టర్ , ఇలా ఉంటారు. వారంతా కొద్దీ సమయంలోనే మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. వారంతా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. కట్ చేస్తే అసలు కథ అక్కడే మొదలవుతుంది. ఎందుకంటే హీరోయిన్ కు అక్కడ ఏవో వింత సంఘటనలు జరుగుతూ ఉండడం గమనిస్తుంది. అయితే అక్కడ ఓ హత్య జరుగుతుంది. అసలు ఆ హత్య చేసింది ఎవరు ? ఆ బిజినెస్ మ్యాన్ ఈ ఆరుగురిని మాత్రమే ఎందుకు రమ్మన్నాడు ? ఆ తర్వాత ఏమైంది ? హీరోయిన్ ఆ హత్య చేసిన వారిని కనిపెట్టిందా లేదా ? ఇవన్నీ తెలియాలంటే “ఇన్విటేషన్ టు ఏ మర్డర్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ కు అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments