చాక్లేట్ చూస్తే సైకోలా మారే హీరో.. OTT లో నెక్ట్ లెవెల్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

OTT Best Suspense Thriller In Telugu: కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు .. అక్కడ జరిగేది ఇమాజినేషన్ ఆ లేక నిజమా అనేది అసలు అర్ధం కాదు. కానీ ఇలాంటి సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్స్ మాత్రం చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ సారి చెక్ చేసేయండి.

OTT Best Suspense Thriller In Telugu: కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు .. అక్కడ జరిగేది ఇమాజినేషన్ ఆ లేక నిజమా అనేది అసలు అర్ధం కాదు. కానీ ఇలాంటి సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్స్ మాత్రం చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓ సారి చెక్ చేసేయండి.

మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఓ రకమైన సస్పెన్స్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తే.. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్స్ మరో రకమైన ఎక్స్పీరియన్స్ ను ఇస్తాయి. అయితే ఇలాంటి సైకాలిజికల్ థ్రిల్లర్స్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అది కూడా తెలుగులో అందుబాటులో ఉండే సినిమాలు చాలా తక్కువ. వీటిలో కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు .. అక్కడ జరిగేది ఇమాజినేషన్ ఆ లేక నిజమా అనేది అసలు అర్ధం కాదు. కానీ ఈ జోనర్ సినిమాలు చూస్తున్నంత సేపు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. తిరు అనే అబ్బాయి.. ఫుడ్ డెలివరీ బాయ్ లా పని చేస్తూ ఉండేవాడు. అతను చాలా కష్టపడి పని చేసేవాడు. అతనికి సొంత వారు ఎవరు లేకపోయినా సరే.. పగలు రాత్రి తేడా లేకుండా.. పని చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అర్ధరాత్రి ఫుడ్ డెలివెరి చేయడానికి చాలా దూరం వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అపార్ట్మెంట్ లిఫ్ట్ పని చేయకపోవడంతో.. అతనికి కాల్ చేస్తే.. వారు తిరునే పైకి రమ్మని చెప్తాడు. తీరా పైకి వెళ్లిన తర్వాత ఆ కష్టమర్ తిరుని బాగా విసిగించడంతో.. వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. తిరు అతనిని కొట్టేసి వచ్చేస్తాడు. కట్ చేస్తే ఇక్కడ మరొక సీన్ ను చూపిస్తారు. ఈ సీన్ లో తిరు టీవీలో ఓ చాక్లేట్ అడ్వర్టైస్మెంట్ ను చూసి.. విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దానిని చూస్తూ చూస్తూనే కోపంతో టీవీని పగలకొట్టేస్తాడు.

ఇక మరొక రోజు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి ఇంకొక ఇంటికి వెళ్తాడు. అక్కడ కూడా కష్టమర్ ఇబ్బంది పెట్టడంతో.. అతనిని కూడా కొడతాడు. దీనితో తనకు ఎదో జబ్బు ఉందని అనుకుని.. అతను ఓ సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తాడు. దీనితో డాక్టర్ అతనికి కౌన్సిలింగ్ , టాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తాడు. అయితే ఇప్పటివరకు జరిగిన గొడవలన్నీ కూడా కేవలం అతని ఇమాజినేషన్ మాత్రమే. ఈ క్రమంలో ఓ రోజు ఒక అమ్మాయి ఫుడ్ ఆర్డర్ పెట్టడంతో.. అది ఇవ్వడానికి వెళ్తాడు. అక్కడ తిరు ఆ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. అలా మెల్లగా వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. ఆ అమ్మాయి పేరు సుబ్బు. కొద్దిరోజులకు కానీ తెలియదు సుబ్బు ఆ ఇంట్లో పనిమనిషి అని. అయినా సరే వారిద్దరూ ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో ఓ రోజు సుబ్బు తిరు కు చాక్లేట్ ఇస్తుంది. మళ్ళీ తిరు అగ్రెసివ్ అయిపోతాడు. కట్ చేస్తే సుబ్బు పని చేసే ఇంటి ఓనర్ అయినా ముసలావిడ చనిపోతుంది. అసలు ఆ ముసలావిడ ఎందుకు చనిపోతుంది ? చాక్లేట్ చూడగానే తిరు ఎందుకు అగ్రెసివ్ అవుతాడు ? తిరు గతం ఏంటి ? తిరు నిజంగా ఆ హత్యలు చేశాడా ? తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే.. “అనీతి” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా ఇప్పటివరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments