OTT Suggestions- Best Adventure Thriller : భూమికి ఆకాశానికి మధ్య వింత రాక్షస ప్రపంచం.. OTT లో బెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్

భూమికి ఆకాశానికి మధ్య వింత రాక్షస ప్రపంచం.. OTT లో బెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్

OTT Adventure Thriller : సైన్స్ ఫిక్షన్ , యాక్షన్, అడ్వెంచర్ మూవీస్ ను ఈ మధ్య ప్రేక్షకులంతా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

OTT Adventure Thriller : సైన్స్ ఫిక్షన్ , యాక్షన్, అడ్వెంచర్ మూవీస్ ను ఈ మధ్య ప్రేక్షకులంతా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఇంకా ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. సైన్స్ ఫిక్షన్ , యాక్షన్, అడ్వెంచర్ మూవీస్ ను ఈ మధ్య ప్రేక్షకులంతా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ మంచి ఫాంటసీ థ్రిల్లర్ మూవీ చూడాలంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక చిన్న పిల్లోడు బుక్ చదువుతూ ఉండడంతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అతని పేరు జాక్ . అతనికి మహారాజుల కథలన్నా , ప్రపంచం గురించి తెలుసుకోవడం అన్నా చాలా ఇష్టం . అయితే జాక్ ఎప్పుడు ఒక మహారాజు కథను వింటూ ఉండేవాడు. అది ఎలాంటిదంటే ప్రపంచం మొత్తం మహారాజుల పెత్తనంలో ఉండేది. ఆ సమయంలో కొంతమంది పాస్టర్లు విత్తనాలు తయారు చేసి వాటిని భూమిలో వేస్తారు. దాని ద్వారా ఆకాశంలోకి వెళ్లి దేవుడిని కలవచ్చని అనుకుంటారు. ఆ విత్తనం ద్వారా చాలా పెద్ద మొక్క తయారౌతుంది. వీరంతా కూడా దాని ద్వారా దేవుడిని కలవడానికి బయల్దేరతారు. ఈ క్రమంలో భూమికి ఆకాశానికి మధ్య మరొక వింత ప్రపంచం ఉన్నట్లు వారు గుర్తిస్తారు. అది చాలా భయంకరమైన ప్లేస్.. అక్కడ మనుషుల కంటే పెద్దగా కనిపించే జైంట్స్ ఉంటారు. ఆ జైంట్స్ మనుషులను చూసిన తర్వాత వాటికి భూమి మీదకు వెళ్లే మార్గం తెలిసిపోతుంది. దీనితో అవి వెంటనే భూమి మీదకు వచ్చి.. అన్నిటిని నాశనం చేయడం స్టార్ట్ చేస్తాయి. మనుషులను చంపేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తాయి.

దీనితో అక్కడ మహారాజు సహాయకులు ఆ జెయింట్స్ ను చంపేస్తాడు. విత్తనాలు తయారు చేసిన పాస్టర్లు ఆ జైంట్ గుండె తీసి ఒక కిరీటం తయారు చేస్తాడు. ఆ కిరీటం పెట్టుకుని మహారాజు మిగిలిన జెయింట్స్ ముందుకు వెళ్ళగానే.. అవన్నీ కూడా రాజు ముందు తల వంచుకు నుంచుని.. బానిసలైపోతాయి. దీనితో మహారాజు వాటిని తిరిగి వాటి లోకానికి వెళ్లిపోవాలని ఆదేశించి. అవి వెళ్ళిపోయినా వెంటనే చెట్టును నరికించేస్తాడు. ఇక రాజు చనిపోయినా తర్వాత అతనితో పాటు ఆ విత్తనాలను, కిరీటాన్ని కూడా అతనితోనే పూడ్చేస్తారు. ఇలా ఈ కథ అంటే జాక్ కు చాలా ఇష్టం. జాక్ మదర్ ఒక మహారాజు కుటుంబానికి చెందినది. ఇదంతా కూడా ఆమె కుటుంబం కథే. కట్ చేస్తే మూవీ స్టోరీని పదేళ్ల తర్వాత చూపిస్తారు. ఇక్కడ జాక్ కు ఇసా బెల్లా అనే ఒక ప్రిన్సెస్ కనిపిస్తుంది. ఇక ప్రిన్సెస్ కు తన కోటకు వెళ్లిన తర్వాత.. అక్కడ ఆమెకు ఒక కిరీటం కనిపిస్తుంది. అది చనిపోయిన ఆ మహారాజు కిరీటం.

ఇక జాక్ తన గుర్రాన్ని అమ్మడానికి ఒక ప్లేస్ దగ్గరకు వచ్చిన తర్వాత.. ఒక పాస్టర్ అతినికి డబ్బులకు బదులుగా కొన్ని విత్తనాలు ఇచ్చి.. వాటిని ఎట్టి పరిస్థితిలో నీటిలో తడపొద్దు అని చెప్తాడు. మరో వైపు ప్రిన్సెస్ తనతో పాటు ఆ కిరీటాన్ని తీసుకుని వచ్చి.. అనుకోకుండా జాక్ ఇంట్లో చిక్కుకుపోవడం. . అలాగే జాక్ దగ్గర ఉన్న విత్తనాలకు నీరు తగలడంతో.. ఆ ఇంటితో పాటు ఓ పెద్ద చెట్టు పెరిగిపోతుంది. అచ్చం ఆ కథలో చెప్పిన దానిలానే జరుగుతుంది. దీనితో మళ్ళీ ఆ జెయింట్స్ భూమి మీదకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది ? ఆ జెయింట్స్ భూమి మీదకు రావడం వలన ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ? వారి వద్ద ఉన్న కిరీటాన్ని వారు ఉపయోగించుకున్నారా లేదా ? ఇవన్నీ తెలియాలంటే.. “జాక్ ది జైంట్ స్లేయర్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే తెలుగులో చూడాలంటే అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే. వెంటనే చూసేయండి. ఈ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments