OTT Suggestion: OTTలో అద్భుతమైన సినిమా! భార్యాభర్తలు కలిసి చూస్తే.. గొడవలన్నీ పోతాయి!

ఓటీటీ లో చాలా సినిమాలు ఉన్నా కూడా.. ఇప్పుడు ఉన్న జెనరేషన్ కు తగినట్టుగా మాత్రం చాలా కొన్ని సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా అలాంటిదే . ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

ఓటీటీ లో చాలా సినిమాలు ఉన్నా కూడా.. ఇప్పుడు ఉన్న జెనరేషన్ కు తగినట్టుగా మాత్రం చాలా కొన్ని సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా అలాంటిదే . ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

ఇప్పుడున్న యంగ్ జెనెరేషన్, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్లకు, చేసుకోబోయే వాళ్లకు ఈ సినిమా ఎంతో బాగా నచ్చేస్తుంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఓ మంచి వర్త్ వాచింగ్ మూవీ మిస్ అయినట్లే. హర్రర్, సస్పెన్స్ , క్రైమ్ థ్రిల్లర్స్ ఈ మధ్య కాలంలో అందరు చూసే సినిమాలే. కాస్త వీటి నుంచి బ్రేక్ తీసుకుని.. ఇలాంటి ఓ సినిమా చూస్తే.. ఫ్యూచర్ మీద ఖచ్చితంగా ఓ క్లారిటీ వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్లకు ఉండే ఎన్నో డౌట్స్ కు సమాధానమే ఈ సినిమా. చూసే వాళ్లకు అరే ఇది నిజమే కదా అనే ఓ మంచి ఫీలింగ్ ను కూడా తీసుకువస్తుంది ఈ సినిమా. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “ఇరుగపాట్రు”.. ఈ సినిమాను యువరాజ్ దయాలన్ డైరెక్ట్ చేశారు. కాగా ఈ సినిమాలో.. శ్రద్ధ శ్రీనాథ్, విక్రమ్ ప్రభు, విదార్థ్, శ్రీ, అబర్నథి, సానియా అయ్యప్పన్ లాంటి వారు ప్రధాన పాత్రలలో అలరించారు. ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చాలా వరకు ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు ఇతర భాషలలో విడుదలై తెలుగులోకి వచ్చిన తర్వాత అవి హిట్ అవుతున్నాయి. అలాంటి సినిమాలు ఓటీటీ లోకి వచ్చిన తర్వాత వాటి క్రేజ్ మరింత పెరిగిపోతుంది, ఈ క్రమంలోనే ఇరుగపాట్రు సినిమా 2023 లో తమిళంలో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా కథేంటి.. అనే విషయానికొస్తే..

ఇది మొత్తం ముగ్గురు జంటలకు సంబంధించిన స్టోరీ. మిత్ర అనే సైకాలిజిస్ట్.. తన భర్త మనోహర్ తో కలిసి ఓ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఆమె ప్రొఫెషన్ లో భాగంగా ఒక సెమినార్ ని కండక్ట్ చేస్తుంది. అందులో భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలకు ఆమె పరిష్కారాలు చెబుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె అర్జున్ అనే వ్యక్తి అతని భార్య అసలు మాట్లడట్లేదని, దగ్గరికి వెళ్తే దూరం వెళ్తందనే సమస్యతో మిత్ర దగ్గరికి వస్తాడు. ఆమె అంతా విని తన భార్యని రమ్మని చెప్తుంది. ఆమెతో మాట్లాడాక అసలు విషయం మిత్రకి అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత మరొక ఆమె పవిత్ర వచ్చి తన భర్త విడాకులు కావలన్నాడని చెప్తుంది. ఆమె భర్తని రమ్మని చెప్పి సమస్యని తెలుసుకుంటుంది మిత్ర. ఇలా తన దగ్గరకు వచ్చిన వారికీ పరిష్కారాలు చెప్పే క్రమంలో.. మిత్ర, ఆమె భర్త మధ్య కూడా ఎదో సమస్య ఉందని గ్రహిస్తుంది. మరి మిత్ర వీటిని ఎలా సాల్వ్ చేసింది! ఆ భార్య భర్తలను కలిపిందా లేదా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments