Parchur Assembly constituency: పర్చూరులో YCP భారీ ప్లాన్! ఈ సారీ TDP ఔట్!

పర్చూరులో YCP భారీ ప్లాన్! ఈ సారీ TDP ఔట్!

వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు చాలా సమయం ఉన్నా కూడా ఇప్పటి నుంచి ఎన్నికల వాతావరణం ఏపీలో కనిపిసిస్తుంది. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ మంచి దూకుడు మీద ఉంది. 175 స్థానాల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. అందుకు తగినట్లే క్షేత్ర స్థాయిలో వైసీపీకి మంచి బలం ఉంది. అయినప్పటీక ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా వైసీపీ నేతలందరూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. 175 గెలుపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో ఒకటి  ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి ప్రకాశం  జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ గుంటూరుకు సరిహద్దుగా ఉన్న పర్చూరు అంటే రాజకీయల్లో  ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి ఎందరో  నాయకులు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.  నందమూరి తారక రామారావు అల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. మంత్రిగా కూడా పని చేశారు. టీడీపీ పట్టున్న స్థానాల్లో పర్చూరు ఒకటి అని చెప్పవచ్చు. ఎక్కువ సార్లు ఇక్కడ టీడీపీ గెలుస్తు వచ్చింది. దగ్గుబాటి వెంకటేశ్వరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి.. టీడీపీ జెండాను దించారు. అయితే 2014,2019లో మళ్లీ టీడీపీ జెండానే ఇక్కడ ఎగిరింది.

2019 జగన్ మోహన్ రెడ్డి సునామిని తట్టుకుని  కేవలం 1600 ఓట్ల స్వల్ప మోజార్టీతో టీడీపీ ఇక్కడ విజయం సాధించింది. వరుసగా రెండు సార్లు ఏలూరి సాంబశివ రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ సారీ మాత్రం పక్క వైసీపీ గెలుస్తుందని నియోజవర్గ ప్రజలు అంటున్నారు. ఇప్పటి వరకు ఏలూరుకు ధీటైన నాయుకుడు లేకపోవడంతో, స్థానిక వైసీపీ నేతలకు ధైర్యం  ఇచ్చే వారు లేకపోవడంతో టీడీపీకి విజయం అందింది. అయితే ఈసారీ అక్కడ వైసీపీ జెండ ఎగరడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం వ్యూహాలు రచిస్తుంది. 2019లోనే పర్చూరులో వైసీపీ గెలవాల్సి ఉంది. కొన్ని పరిస్థితుల కారణంగా స్వల్ప మోజార్టీతో ఓటమి పాలైంది. అయితే ఈ సారీ వైసీపీ జెండ ఎగరాడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని ఆ పార్టీ నేతలు వదలడంలేదు.

అందుకే ఈ సారీ ఆమంచి కృష్ణమోహన్  లాంటి బలమైన నాయకుడిని పర్చూరు ఇన్ ఛార్జీగా పార్టీ నియమించింది. దీంతో ఆయన అక్కడి నేతలను కలుపుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. అలానే ప్రస్తుత ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుపై ప్రజల్లలో వ్యతిరేకత ఉందని, అదే వైసీపీ కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  ఇప్పటికే పర్చూరులో పలు అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. అలానే సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు, బలమైన నేత కృష్ణమోహన్  కలయికతో ఈ సారీ పర్చూరులో వైసీపీ జెండ ఎగరడం ఖాయమని  ఆ పార్టీ నేతలు బలంగా చెబుతున్నారు. మరి.. పర్చూరులో వైసీపీ జెండా ఎగిరేందుకు వైసీపీ వేసిన ఈ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments