iDreamPost
iDreamPost
రాష్ట్ర ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ స్వగ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సత్తా చాటారు. తెలుగుదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా, దుగ్గిరాల పంచాయతీలో వైసీపి అభ్యర్ధుల గెలుపుని అడ్డుకోలేకపొయారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని 18 పంచాయతీలకి నిన్నటి రోజున ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ అభ్యర్ధులకు 85.62 శాతం ఓట్లు నమోదవ్వగా , వార్డు సభ్యులకు 77.44 శాతం ఓట్లు నమొదయ్యాయి ఇక నిమ్మగడ్డ రమేష్ సొంత గ్రామమైన దుగ్గిరాలలో 91.66 శాతంతో అత్యధికంగా పోలింగ్ నమోదయినట్టు అధికారులు తెలిపారు.
అయితే దుగ్గిరాల మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ మద్దతుదార్లు 11 పంచాయతీల్లో విజయం సాధించగా, తెలుగుదేశం బలపరచిన అభ్యర్ధులు ఇద్దరు, తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్ధులు ఇద్దరు, ఒక పంచాయతీలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. ఇక నిమ్మగడ్డ రమేష్ సొంత గ్రామం అయిన దుగ్గిరాలలో తెలుగుదేశాన్ని గెలిపించాలన్న ఆ నాయకుల పాచికలు పారలేదు. వైయస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉన్న బాణావతు కుషీభాయి 1169 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం దుగ్గిరాల్లో ఉన్న 16 వార్డులకు గాను 10 వార్డుల్లో వైయస్సార్ కాంగ్రెస్ మద్దతుదార్లు గెలుపొందారు.