Woman Panna Royal Family Dragged Out Temple: వీడియో: ఆలయంలో రచ్చ రచ్చ చేసిన రాజకుటుంబీకురాలు

వీడియో: ఆలయంలో రచ్చ రచ్చ చేసిన రాజకుటుంబీకురాలు

వీడియో: ఆలయంలో రచ్చ రచ్చ చేసిన రాజకుటుంబీకురాలు

దేవాలయం అంటే ఎంతో పవిత్రమైనది. అందుకే ఇక్కడ అనేక నిబంధనలు ఉంటాయి. వాటిని సామాన్యుల నుంచి ప్రముఖల వరకు అందరు పాటించాల్సిందే.  అయితే కొందరు ప్రముఖులు మాత్రం తాము ప్రత్యేకం అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. దేవాలయాల్లోకి వచ్చినప్పుడు నిబంధనలు పాటించకుండా.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ రాజవంశానికి చెందిన మహిళ ఆలయంలో నిబంధనలను ఉల్లంఘించింది. మద్యం సేవించి.. ఆలయంలోని పూజలకు హాజరైంది.  దీంతో నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు శుక్రవారం ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లా బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ప్రఖ్యాత శ్రీ జుగల్ కిశోర్ మందిరం ఉంది. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అలానే కృష్ణాష్టమి పండగ రోజున కూడా అర్ధరాత్రి సమయంలో కృష్ణుడి జన్మదిన వేడుకలు ఘనంగా జరగడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో రాజ కుటుంబీకులు ప్రతిమను చీపురుతో శుభ్రపరిచే ‘చాన్వార్’ సంప్రదాయాన్ని మాత్రమే ఆచరిస్తారంట. అది కూడా పురుషులు మాత్రమే ఆచరిస్తారని పోలీసు తెలిపారు. అయితే ఇటీవల కృష్ణాష్టమి రోజున రాజకుటుంబానికి చెందిన జితేశ్వరీ దేవి అనే మహిళ నిబంధనలను ఉల్లంఘించింది. ఆచారాన్ని అతిక్రమిస్తూ.. ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి.. దేవుడికి హారతి ఇచ్చారని పోలీసులు తెలిపారు.

దీంతో ఆలయ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగి ఆమె కిందపడిపోయారు. ఆమె మద్యం సేవించి ఉందని ఆలయ అధికారులు గుర్తించారు. ఆమెను ఆసలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోవాలని కోరారు. ఈ సమయంలో అర్చకులు, అక్కడి భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకోన్నారు. ఈ క్రమంలో ఆమె వారిపై కూడా దుర్భాషలాడారని తెలిపారు. పోలీసులు వచ్చి వారించినా ఆమె తగ్గలేదు. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా బయటకు లాక్కుని తీసుకెళ్లామని, అనంతరం ఆమెపై కేసు నమోదు చేశామని కూడా తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ  వీడియోలు వైరల్ అయ్యాయి.  మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments