పోతిరెడ్డిపాడు మీద పేచీ ఎందుకు?

శ్రీశైలం జలాశయంకు పోటెత్తిన వరద . కృష్ణా , తుంగభద్ర నదుల నుండి 5 లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది . శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.30 అడుగుల వద్ద 211 టీఎంసీల నీటితో నిండు కూడలా ఉంది.

శ్రీశైలంలో ఆంద్రప్రదేశ్ ఫవర్ హౌస్ నుంచి 22,384 వేల క్యూసెక్కులు , తెలంగాణ ఫవర్ హౌస్ నుంచి 31,783 వేల క్యూసెక్కులు స్పిల్వే నుంచి 3,76,170 లక్షల క్యూసెక్కులు నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 15000 వేల క్యూసెక్కుల నీటిని , అలాగే HNSS కు2026 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నారు.

ఐతే పోతిరెడ్డిపాడు నుంచి 15000 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుంటూ బనకచర్ల నుంచి తెలుగుగంగ ద్వారా వెలుగోడు జలాశయానికి 12000 క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నారు . మిగతా 3000 క్యూసెక్కుల నీటిని SRBC కి వదులుతున్నారు . ఐతే ఒక అనుమానం రావచ్చు లక్షల క్యూసెక్కుల వరద వస్తుంటే కేవలం 15000 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారని .

బనకచర్ల నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా 12000 క్యూసెక్కుల నీటిని వెలుగోడు జలాశయంకు పంపిస్తున్నారు . వెలుగోడు జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం16.95టీఎంసీ ఐతే ఇప్పుడు 8 టీఎంసీ వరకు ఉంది . అక్కడి నుంచి ఔట్ ఫ్లో లేదు . అదే తెలుగుగంగ కాలువ కింద SR1 పూర్తి స్థాయి నీటిమట్టం 2.13 టీఎంసీ ఐతే ఇప్పుడు 0.59 టీఎంసీ నీళ్లు ఉన్నాయి .SR2 పూర్తి స్థాయి నీటిమట్టం 2.44 ఐతే ప్రస్తుతం 1.03 టీఎంసీ నీళ్లు ఉన్నాయి .అలాగే బ్రహ్మంసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 17.74 టీఎంసీలు ఐతే ప్రస్తుతం 8.9 టీఎంసీ నీళ్లు ఉన్నాయి .

అలాగే SRBC పరిధిలో గోరుకల్లు జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టం 12.44 టీఎంసీలు ఐతే ప్రస్తుతం 2.21 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అవుకు జలాశయంలో కూడ 4.15 టీఎంసీ పూర్తి స్థాయి నీతిమట్టనికి 3.17 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.

అదే విధంగా GNSS పరిధిలో చూస్తే గండికోట రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 26.85 టీఎంసీలకు గాను 24.36 టీఎంసీల నీళ్లు ఉంటే ,వామికొండసాగర్ లో 1.60 టీఎంసీల పూర్తి స్థాయి నీటిమట్టనికి 1.2 టీఎంసీల నీళ్లు ఉన్నాయి . అలాగే సర్వరాయసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 3 టీఎంసీలు ఐతే 0.89 టీఎంసీల నీళ్లు ఉన్నాయ్.

పెన్నా పరివాహకం పరిధిలో HLC నుంచి 3 టీఎంసీల కేటాయింపు ఉన్న మైలవరం జలాశయంలో 6.5 టీఎంసీల పూర్తి స్థాయి నీతిమట్టనికి 2.3 టీఎంసీల నీరు ఉంది . అలాగే చిత్రావతి పూర్తి స్థాయి నీటిమట్టం 10 టీఎంసీలకు గాను 8.9 టీఎంసీల నీళ్లు ఉన్నాయ్ . అదేవిధంగా పైడిపాలెం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 6 టీఎంసీలకు గాను 4.8 టీఎంసీల నీరు ఉంది .

ఎప్పుడు రాయలసీమలో ఒట్టి కుండాలుగా ఉండే జలాశయాలు ముఖ్యంగా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని వాడుకునే అన్నీ ప్రాజెక్టులలో నీరు ఉంది . ఇది ఇప్పుడు ఈ సంవత్సరం కృష్ణా నుంచి తీసుకున్న నీరు కాదు . ఈశాన్య రుతుపవనాల కారణంగా స్థానిక చిన్న చిన్న నదుల నుంచి వచ్చి వివిధ రిజర్వాయర్లలో చేరిన నీరే కాకుండా నీటిని వృధా చేయకుండా గత సంవత్సరంలో వచ్చిన నీరు కూడా ఇందులోఉంది .

మొత్తంగా 109టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లలో ఇప్పటికే 66.35 టీఎంసీల నీరు ఉంది . ఇప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి కావలసింది కేవలం 42టీఎంసీలు మాత్రమే .

పోతిరెడ్డిపాడు ద్వారా 101టీఎంసీలు వివిధ ప్రాజెక్టులకు నికర మిగులు జలాల కేటాయింపు ఉంటే నేడు పోతిరెడ్డిపాడు నుంచే నీటిని తీసుకోకూడదు అనే వితండవాదానికి తెర తీసింది తెలంగాణ . తెలంగాణ మాత్రం ఏ అనుమతులు లేకుండానే 30 రోజులలో 90 టీఎంసీలను ఎత్తిపోసే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కట్టుకుని నీటిని వాడుకోవచ్చు. అలాగే 800 అడుగుల నుంచే 40 టీఎంసీలు ఎత్తిపోసే కల్వకుర్తి పథకం , 30 టీఎంసీలు ఎత్తిపోసే డిండి పథకాల ద్వారా నీటిని వాడుకోవచ్చు అనే బ్రమల్లో బతుకుతూ నీటి దోపిడీకి తెర లేపుతున్నది .

ఇప్పటికే ఈ సంవత్సరం తెలంగాణ కరెంటు దాహానికి శ్రీశైలం నుంచి విలువైన తాగు సాగునీటి జలాలు 47 టీఎంసీలు సముద్రపాలు అయ్యాయి .రాబోయే రోజుల్లో భవిష్యత్లో మరిన్ని వందల టీఎంసీలు సముద్రంలో కలపడం కాయం. అపోహల్లో బతుకుతూ కరువుసీమ రైతుకు కడగండ్లను మిగల్చడానికి తెలంగాణ పన్నిన కుట్రనే ఇది .

నీటి దోపిడీ నీటి దోపిడీ అనే వట్టి మాటలు కట్టిపెట్టి, బేసిన్లు లేవు భేషజాలు లేవు అనే గట్టి మాటకు ప్రాణంపోయాలి కదా . చెప్పిన మాటలు గుర్తుంటే , వాస్తవాలు తెలిసుంటే .

Written By నరేన్ నిప్పులవాగు

Show comments