ప్రశ్నించే మల్లన్న వెనుక పార్టీల ముసుగు

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్న వెనుకాల ఎవరు ఉన్నారు. అసలు చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్నగా రాజకీయ నాయకుడిగా ఎలా మారాడు ఓ లుక్కేద్దాం.

నల్గొండ జిల్లాలో పుట్టిన మల్లన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి MA చేసిన తరువాత మీడియాలో కెరీర్ ప్రారంభించాడు. V6న్యూస్ లో మల్లన్నగా నటించడం తెలంగాణ యాస, బాష ద్వారా ప్రజల్లో గుర్తింపు లభించింది. మల్లన్నకు భాష మీద పట్టుతో ప్రజా సమస్యలపై ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ప్రజల్లో గుర్తింపు రావడంతో V6న్యూస్ ఛానెల్ వదిలేసి తరువాత కాంగ్రెస్ పార్టీలోని తన సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, వరంగల్ జిల్లాకు చెందిన బీసీ నేత, అప్పటి పీసీసీ చీఫ్ ద్వారా 2015 ఎన్నికల్లో ఎమ్మెల్సీ టికెట్ సాధించాడు.

వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగాడు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి 66 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న కేవలం 13 వేల ఓట్లు మాత్రమే సాధించాడు. తరువాత కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా పార్టీని వీడి సొంతగా జనాలలోకి వెళ్ళలాని నిర్ణయించుకుని క్యూ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు.

దళితులు వెనుకబడిన వర్గాలలో చైతన్యం తేవడం కోసం ప్రతిరోజు ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించడం, సీఎం కేసీఆర్ ను విమర్శించడం, మంత్రులు,ఎమ్మెల్యేలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో జనాలలో పేరు తెచ్చుకున్న మల్లన్న వెనుక కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయని తెలియడంతో అతను కూడా ప్రశ్న ముసుగులో ఉన్న రాజకీయ పార్టీ లాంటి వాడని అంటున్నారు.

2019 ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ తరుపున పనిచేశారు. బండి సంజయ్ ,అర్వింద్ మున్నురు కాపు సామాజిక వర్గం కావడంతోనే వారితో పనిచేసాడని టాక్. మల్లన్న చేసే కార్యక్రమాలకు అన్నింటికీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్థిక సహాయం చేసాడని చర్చ జరుగుతుంది.

2021 వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అంతకు ముందు మల్లన్న చేసిన పాదయాత్రకు కూడా బీజేపీ నేతలు మల్లన్నకు ఆర్థిక సహాయం అందజేశారట. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం ఓడిపోవడానికి కారణం మల్లన్ననే అని టాక్. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలిపోవడం వల్లనే మళ్ళీ టిఆర్ఎస్ గెలిచింది. రెండో స్థానంలో మల్లన్న నిలిచాడు.

దళితులు, పేదల పక్షాన పోరాటం చేస్తున్నామని చెప్పే మల్లన్న వెనుక రాజకీయ పార్టీలు ఉండి నడిపిస్తున్నాయని తెరవెనుక చర్చ జరుగుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అని చెప్పుకొనే మల్లన్న ఎదో ఒక రాజకీయ పార్టీ అండతోనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగులు, దళితులు తరుపున ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాడని ఆశించిన మల్లన్న వెనుకాల కూడా తన సామాజిక వర్గానికి చెందిన రాజకీయ పార్టీల నేతలు ఉండడం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Also Read : కేసీఆర్‌ మాట అన్నారంటే వెనక్కి తగ్గరు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రశంసల వర్షం

Show comments