గుడ్‌న్యూస్‌: టీమ్‌లోకి తిరిగొస్తున్న కోహ్లీ! రీఎంట్రీ మ్యాచ్‌ కన్ఫామ్‌!

Virat Kohli, India vs England: ఒకవైపు ఇంగ్లండ్‌పై వరుస విజయాలతో టీమిండియా దూసుకెళ్తోంది. మరోవైపు కోహ్లీకి వారసుడు పుట్టడంతో భారత క్రికెట్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలోనే మరో గుడ్‌ న్యూస్‌ అందింది. కోహ్లీ వచ్చేస్తున్నాడు.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, India vs England: ఒకవైపు ఇంగ్లండ్‌పై వరుస విజయాలతో టీమిండియా దూసుకెళ్తోంది. మరోవైపు కోహ్లీకి వారసుడు పుట్టడంతో భారత క్రికెట్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలోనే మరో గుడ్‌ న్యూస్‌ అందింది. కోహ్లీ వచ్చేస్తున్నాడు.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారత సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ కొ​ంత గ్యాప్‌ తర్వాత తిరిగి గ్రౌండ్‌లోకి దిగబోతున్నాడు. తాజాగా తనకు కొడుకుపుట్టాడనే శుభవార్తను అభిమానులతో పంచుకున్న కోహ్లీ.. ఇక బ్యాట్‌ పట్టిబరిలోకి దిగేందుకు రెడీ అయిపోయినట్లు సమాచారం. నిజానికి ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ఆడాల్సిన కోహ్లీ.. తొలి టెస్ట్ ఆరంభానికి ముందు హఠాత్తుగా ఇంటికి వెళ్లిపోయాడు. వ్యక్తిగత కారణంతో కోహ్లీ ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరం అయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. చివరి మూడు టెస్టులకు తిరిగి అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు కూడా పేర్కొంది.

కానీ, మూడో టెస్టుతో పాటు నాలుగో టెస్టుకు కూడా కోహ్లీ అందుబాటులో ఉండటం లేదనే వార్తతో క్రికెట్‌ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలు కోహ్లీ కుటుంబంలో ఏం జరుగుతుందో అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. తొలుత కోహ్లీ తల్లి ఆరోగ్యం బాగా లేదని, ఆ తర్వాత రెండో సారి తండ్రి కాబోతున్నాడంటూ వార్తలొచ్చాయి. కోహ్లీ రెండో సారి తండ్రి కాబోతున్నాడని చెప్పిన డివిలియర్స్‌, అంతలోనే తాను అబద్ధం చెప్పినట్లు వెల్లడించాడు. కానీ, డివిలియర్స్‌ చెప్పిన మాటే నిజమైంది. ఫిబ్రవరీ 15న కొడుకు పుట్టినట్లు, అతనికి అకాయ్‌ అని పేరు పెట్టినట్లు తాజాగా కోహ్లీ శుభవార్త చెప్పాడు. దీంతో కోహ్లీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేస్తూ.. కోహ్లీ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులో బరిలోకి దిగబోతున్నాడనే విషయం తెలుస్తోంది.

మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల ప్రారంభం కానుంది. చివరిదైన ఈ టెస్టుతో కోహ్లీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే జరిగిన మూడు టెస్టుల్లో.. తొలి మ్యాచ్‌ ఇంగ్లండ్‌, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కుర్రాళ్లు అద్భుతంగా ఆడుతున్నా.. జట్టులో కోహ్లీ లాంటి సీనియర్‌ ప్లేయర్‌ లేని లోటు కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు కోహ్లీ ఐదు టెస్టుతో బరిలోకి దిగితే.. టీమిండియా మరింత పటిష్టం కానుంది. ఈ టెస్టు తర్వాత కోహ్లీ ఐపీఎల్‌లో ఆడనున్నాడు. మరి కొడుకు పుట్టిన తర్వాత కోహ్లీ తిరిగి వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments