ఒకప్పుడు పశువుల కాపరి.. ఇప్పుడు IAS! ఈమెకు హ్యాట్సాఫ్ అనాల్సిందే..

ఒకప్పుడు పశువుల కాపరి.. ఇప్పుడు IAS! ఈమెకు హ్యాట్సాఫ్ అనాల్సిందే..

“పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు.. కానీ, పేద వాడిగా మరణించడం మాత్రం నీ తప్పే” అని  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గారు అన్నారు. అవును.. ఆయన చెప్పిన మాటలు వందకు వందశాతం కరెక్ట్. వివిధ సమస్యలను సాకుగా చెప్పి.. విజయం సాధించలేక పోయమంటూ చాలా మంది యువత చెప్తుంటారు. కొందరు మాత్రం అబ్దుల్ కలామ్ మాటలనే ఆదర్శంగా తీసుకుని అనుకున్న లక్ష్యాని సాధిస్తుంటారు. అంతేకాక వారి జీవిత కథలు మనలో స్పూర్తి నింపడంతో పాటు ఇన్ని కష్టాలు పడి కెరీర్ విషయంలో సక్సెస్ అయ్యేవాళ్లు ఉంటారా? అనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. తాజాగా ఓ మహిళ సక్సెస్ స్టోరీ వింటే మీరు హ్యాట్సాఫ్ అనకమానరు. ఒకప్పుడు పశువుల కాపరిగా పని చేసి.. ఇప్పుడు కలెక్టర్ గా మారి విధులు నిర్వహిస్తున్నారు. మరి.. ఆ విజేత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళనాడు రాష్ట్రంలోని సత్యమంగళం ప్రాంతానికి చెందిన వన్మతి  పేద కుటుంబంలో జన్మించింది. ఆమెకు చిన్నతనం నుంచి ఐఏఎస్ అవ్వాలని కలలు కనేది. అలానే 2015 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం నుంచి సివిల్స్ టాపర్ గా నిలిచింది. కష్టమైనదానిని ఇష్టంగా మలచుకుంటే సక్సెస్ సొంతమవుతుందని వన్మతి చెబుతున్నారు.అయితే ఆమె బాల్యం నుంచి ఐఏఎస్ కోసం చాలా కష్ట పడ్డారు. పేద కుటుంబం కావడంతో.. కష్టపడి చదవాలని భావించింది. అలానే కుటుంబానికి సాయం చేస్తూ తన చదువును కొనసాగించారు.

పశువులను మేపుతూనే  కుటుంబానికి తోడుగా నిలిచే వారు. ఆమె ఎక్కడికి వెళ్లినా తన వెంట బుక్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ విధంగానే వన్మతి డిగ్రీ పూర్తైన తర్వాత ప్రైవేట్ బ్యాంక్ లో ఉద్యోగంలో చేరారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తన లక్ష్యం వైపు అడుగులు వేశారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ ను కొనసాగించారు. తల్లిదండ్రుల సహకారంతో లక్ష్యంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. వన్మతికి రెండుసార్లు సివిల్స్ పరీక్షలలో అనుకున్న ఫలితాలు రాలేదు. అయినా నిరాశ చెందకా లక్ష్యంగా మరింత ధృడంగా గురి పెట్టారు. మూడో ప్రయత్నంలో వన్మతి తన లక్ష్యాన్ని సాధించారు. సివిల్స్ లో 152వ ర్యాంక్ ను ఆమె సొంతం చేసుకున్నారు.

సివిల్స్ ఇంటర్వ్యూ సమయంలో వన్మతి తండ్రి ఐసీయూలో అరుదైన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తండ్రి బాధను దిగమింగుకుని.. ఆమె ఇంటర్వ్యూకు వెళ్లి విజయం సాధించారు. వన్మతికి శిక్షణ పూర్తైన తర్వాత మహారాష్ట్ర రాష్ట్రంలో తొలి పోస్టింగ్ వచ్చింది. ఇక ఇలా ఆమె ఎన్నో అవరోధాలను దాటుకుంటూ అనుకున్న లక్ష్యాని చేరుకుని ఎంతో మంది యువతకు ఆదర్శం గా నిలిచారు.  వన్మతి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోందని పలువురు కామెంట్స్  చేస్తున్నారు. మరి.. పశువుల కాపరిగా నుంచి కలెక్టర్ గా మారిన వన్మతి విజయగాథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments