iDreamPost
iDreamPost
ఎవరీ రామోస్? ఎందుకీ దారుణానికి పాల్పడ్డాడు? అమెరికాకు ఆవేదన రగిల్చాడు? ఎలిమెంటరీ స్కూల్ పై కాల్పులకు ముందు, కుర్రాడు సాల్వెడార్ రామోస్, ముందు ఇంటిదగ్గర బామ్మను కాల్చాడని అధికారులు చెబుతున్నారు.
18 ఏళ్ల రామోస్ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు చనిపోయాడు. ఇతను యుఎస్ సిటిజన్, మెక్సికన్ బోర్డర్ దగ్గర్లోని చిన్నటౌన్ Uvaldeలో చదువుకొంటున్నాడు.
లోకల్ మీడియా ప్రసారం చేస్తున్న ఫోటో రామోస్ బ్రౌన్ హెయిర్ తో, ముఖంలో ఎలాంటి భావాల్లేకుండా ఉన్నాడు
రామోస్ అమ్మమ్మ ఇంటిదగ్గర ఉంటున్నాడు. ముందు ఆమెను తుపాకీతో కాల్చాడు. ఆమెను ఆ తర్వాత హస్పిటల్ కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
ఆమెను కాల్చిన తర్వాత, రామోస్ అక్కడి నుంచి పారిపోయాడు. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు. చేతిలో రైఫిల్స్ ఉన్నాయి.
రాబ్ ఎలిమెంటర్ స్కూల్ ముందు కారును వదిలిపెట్టాడు. క్లాసు రూంల వైపు వెళ్తుంటే, పోలీసు అధికారి అడ్డుకోవడానికి ప్రయత్నించాడు కాని పట్టుకోలేకపోయాడు. అంతే, అమెరికా కాలమానం ప్రకారం, ఉదయం 11.30కి రామోస్ స్కూల్ లోకి వెళ్లాడు. తుపాకీతో విచక్షణరహింతగా కాల్పులు సాగించాడు. ఒకటి తర్వాత మరొకటి క్లాస్ రూంల్లోకి వెళ్తూ, కాల్పులు సాగిస్తూనే ఉన్నాడు. విద్యార్ధులు బల్లల కింద దాక్కున్నా, తప్పించుకోలేకపోయారు.
గురువారం స్కూల్ కి చివరి రోజు. అంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. Robb Elementaryలో మొత్తం 500 మంది ఉన్నారు. వీళ్ళందరూ 5 నుంచి 11 ఏళ్లలోపువాళ్లే. ఎక్కువ మంది లాటిన్ అమెరికా జాతీయులే.
ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులకు చిన్నగాయాలైయ్యాయి. అసలు రామోస్ ఎవరు? ఎందుకు కాల్పులు జరిపాడు? ఎలాంటి ఆయుధాలు వాడాడు? ఈ స్కూల్ కి అతనికి సంబంధమేంటని విచారిస్తున్నారు. ఇప్పటిదాకా రామోస్ మీద ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదు. అతని పేరుమీదున్న ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ను బ్లాక్ చేశారు.