తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పాక్షిక ఊరట

  • Published - 07:31 AM, Wed - 13 November 19
తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పాక్షిక ఊరట

గత జులై 23, 2019లో కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష సందర్భంగా జేడీఎస్ కాంగ్రెస్ విప్ ను ధిక్కరించిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్  అనర్హత వేటు వేసిన స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్ట్ నేడు  తీర్పు ఇచ్చింది.  స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మాత్రం  కల్పించింది. కుమారస్వామి ప్రభుత్వం విశ్వాసపరీక్ష సమయంలో విప్ ధిక్కరించిన 17 మంది ఎమ్మెల్యేలను 2023 వరకు పోటీ చేయకుండా స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు.ఇందులో 12 మంది కాంగ్రెస్ 3 జేడీఎస్, 2 స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. కాగా సుప్రీంకోర్ట్ తీర్పుతో డిసెంబర్ 5న జరగనున్న ఉపఎన్నికల్లో వీరికి పోటీ చేసే వెసులుబాటు అనర్హతకు గురి అయిన 17 మంది కి లభించింది. దీనితో  అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.


కాగా, కుమారస్వామి ప్రభుత్వానికి విశ్వాస పరీక్షలో అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 103 కాగా కాంగ్రెస్ మరియు జనతాదళ్(సెక్కులర్ )కూటమికి అనుకూలంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి 105 ఓట్లు వచ్చాయి. 21 మంది అభ్యర్థులు ఓటింగ్ కి గైర్హాజరు అయ్యారు. దీనితో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయింది. అనంతరం బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.      

Show comments