PhonePe, Gpay వాడే వారికి RBI శుభవార్త.. ఆ లిమిట్‌ రూ.5లక్షలకు పెంపు.. కానీ

RBI-UPI Payment Limit: యూపీఐ పేమెంట్స్‌ చేసే వారికి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. లిమిట్‌ను భారీగా పెంచింది. కానీ ఇది అన్ని ట్రాన్సాక్షన్లకు వర్తించదు. ఆ వివరాలు..

RBI-UPI Payment Limit: యూపీఐ పేమెంట్స్‌ చేసే వారికి ఆర్బీఐ శుభవార్త చెప్పింది. లిమిట్‌ను భారీగా పెంచింది. కానీ ఇది అన్ని ట్రాన్సాక్షన్లకు వర్తించదు. ఆ వివరాలు..

నేటి కాలంలో యూపీఐ పేమెంట్స్‌ అనగా.. ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా చేసే చెల్లింపులు పెరిగిపోతున్నాయి. అయితే వీటికి డెయిల్‌ లిమిట్‌ ఉంటుంది. ఆ పరిమితి దాటితే.. 24 గంటలు పూర్తయ్యేవరకు తదుపరి పేమెంట్‌ చేయలేం. ఇప్పటి వరకు ఈ లిమిట్‌ లక్ష రూపాయలు ఉంది. ఒక్క రోజులో పేమెంట్‌ లిమిట్‌ లక్ష రూపాయల వరకు ఉండేది. ఇకపై ఈ సమస్యలు తీరనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా నిర్వహించిన మానిటరీ పాలసీ సమావేశంలో యూపీఐ పేమెంట్స్‌ లిమిట్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిమితిని భారీగా పెంచింది. ఎంతంటే.. ఏ పేమెంట్స్‌కి వర్తిస్తుంది అంటే..

మంగళవారం ప్రారంభమైన మానిటరీ పాలసీ సమావేశం నిర్ణయాల్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ నేడు అనగా గురువారం నాడు ప్రకటించారు. ఈసారి కూడా రెపో రేటును 6.50 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ఏడాదికి పైగా అనగా.. గత ఏడాది 2023 ఫిబ్రవరి నుంచి ఈ వడ్డీ రేట్లలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయట్లేదు. ఇదిలా ఉండా ఈ సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో ముఖ్యమైనది.. ట్యాక్స్‌ పేమెంట్లపై యూపీఐ లిమిట్‌‌ను పెంపు. అంతకుముందు యూపీఐ ట్యాక్స్‌ పేమెంట్స్ పరిమితి రూ. లక్ష ఉండగా.. ఇప్పుడు దీనిని ఒకేసారి ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఎక్కువ ట్యాక్స్ చెల్లించేవారు ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూ. 5 లక్షల వరకు యూపీఐతోనే పన్ను చెల్లింపులు చేయవచ్చు.

ఆర్బీఐ ఈ పరిమితి పెంచడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు 2023 డిసెంబర్‌లోనే ఆర్బీఐ.. హాస్పిటల్, విద్యా సంస్థలు వంటి వాటికి చేసే యూపీఐ పేమెంట్ లిమిట్‌ను రూ. 5 లక్షలకు పెంచింది. ఇప్పుడు పన్ను చెల్లింపుల పరిమితిని కూడా పెంచేసింది. సాధారణ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ మాత్రం గరిష్టంగా రూ. లక్షగానే ఉంది. దీనిలో ఎలాంటి మార్పు లేదు. అలానే యూపీఐతో చేసే చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించరు. ఇవే పేమెంట్స్‌.. డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో చేసినప్పుడు మాత్రం.. ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

అలానే చెక్‌ క్లియరెన్స్‌ పైన కూడా ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.   చెక్ క్లియరెన్స్ వేగవంతం చేయాలని.. ఇది గంటల్లోనే పూర్తి కావాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2 నుంచి 3 రోజుల వరకు పడుతుంది. దీన్ని వేగవంతం చేయడం కోసం నిరంతర చెక్‌ క్లియరెన్స్‌ పద్దతిని ప్రవేశపెట్టాలని సూచించారు.

Show comments