పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన అధ్యక్షుడు అల్వీ..

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన అధ్యక్షుడు అల్వీ..

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన అధ్యక్షుడు అల్వీ..

గురువారం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ  రద్దు అయింది. అసెంబ్లీని రద్దు చేస్తూ పాక్ అధ్యకుడు అరిఫ్ అల్వీ ఉత్తర్వూలు జారీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ర్దదు చేయాలని ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్.. అధ్యక్షుడికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. షరీఫ్ సలహా మేరకు ఆ దేశ అధ్యక్షుడు అల్వీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు అల్వీ తెలిపారు. బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసే నిర్ణయాన్ని అధ్యక్షుడు అల్వీ తీసుకున్నట్లు పాక్ జాతీయ పత్రిక డాన్ పేర్కొంది. దీంతో పాక్ లో తర్వలో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. మరి..నూతన ప్రధానిగా ఎవరు అనేది తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

పాక్ అధ్యక్షడు అల్వీ తీసుకున్న ఈ నిర్ణయంతో  పార్లమెంట్ దిగువ సభతో పాటు ముస్లిం లీగ్-నవాడ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రద్దైంది. అయితే ఈ నెల 12 పాక్ పార్లమెంట్ పదవి కాలం ముగియనుండగా మూడు రోజుల ముందే.. రద్ధైంది. ఈ నేపథ్యంలో బుధవారం పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రధానిగా షహ్ బాజ్ షరీఫ్ చివరి ప్రసంగం చేశారు. అసెంబ్లీ అనుమతితోనే  ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అధ్యక్షుడిని కోరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గడువు కంటే మూడు రోజుల ముందే జాతీయ అసెంబ్లీ రద్దవ్వడంతో ఎన్నికల సంఘం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అదే..ప్రభుత్వం తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లైతే 60 రోజుల్లోనే ఎన్నికలు జరగాల్సి ఉంటుంది.

పాక్ లో కొత్త జనాభా గణన ఫలితాలు రావడంతో  ఎలక్షన్లకు ముందే నియోజకవ వర్గాలను విభజన చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 120 రోజుల్లో డీలిమిటేషన్ నిర్వహించి.. ఆ తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని జాతీయ ఎన్నికల కమిషన్ భావించింది. దీంతో జాతీయ అసెంబ్లీ ఎన్నికలు అనుకున్న సమయం కంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన, 90 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించడం అనేది సాంకేతికంగా సాధ్యమే అవుతుంది. కానీ  ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. అయితే స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. గడువులోగా కాకుండా రెండు నెలలపాటు ఎన్నికల ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా పార్లమెంట్ రద్దు కావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు..తాత్కలిక ప్రభుత్వం కొనసాగనుంది.

ఇదీ చదవండి:  అదృష్టం అంటే అతడిదే.. 13 వేల కోట్ల లాటరీ గెలిచాడు!

Show comments