పని రాక్షసుడు.. ఆస్కార్ ఫెర్నెండేజ్

  • Published - 01:45 AM, Tue - 14 September 21
పని రాక్షసుడు.. ఆస్కార్ ఫెర్నెండేజ్

ఆస్కార్ ఫెర్నెండేజ్ కేంద్ర మాజీ మంత్రిగానో, ఎంపీగానో అందరికీ సుపరిచితులే. కానీ ఈ దక్షిణాది కాంగ్రెస్ నేత గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు. కేథలిక్ కుటుంబంలో పుట్టిన ఆస్కార్ ఫెర్నెండేజ్ కుచిపూడి నృత్యంలో శిక్షణపొందారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణుడి ఆలయమున్న ఉడిపి నుంచి ఫెర్నాండెజ్ ఓ మారు కౌన్సిలర్ గా ఐదు సార్లు ఎంపీగా గెలిచారు.

చిరునవ్వులు చిందించే ఆస్కార్ పనిరాక్షసుడన్న విషయం ఆయన సన్నిహితులకు మాత్రమే తెలిసిన విషయం. ఏఐసీసీ ఎలక్షన్ కమిటీ లో సభ్యుడైన తర్వాత ఆయన పార్టీ విజయం కోసం రోజుకు17 గంటలు పనిచేసేవారు. తెల్లవారుజామున మూడుగంటల తర్వాతే ఆఫీస్ నుంచి బయటకు వెళ్లేవారు. కాంగ్రెస్ విజయం కోసం సంస్థాగతంగా తెరవెనుక తీవ్రంగా శ్రమించిన వ్యక్తుల్లో ఆస్కార్ ఫెర్నెండేజ్ ఒకరు. యూపీఏ1,2 ప్రభుత్వాల్లో ఆయన మంత్రిగా పనిచేశారు.. 1980లో ఎంపీగా గెలిచిన తర్వాత రాజీవ్ గాంధీకి సెక్రటరీగా పనిచేశారు.

గాంధీ కుటుంబానికి వీర విధేయుడు..

2009 సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో దిగేందుకు కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అందుకు తగ్గట్టుగా పార్టీలోని సీనియర్స్ తో ఓ కమిటీని నియమించాలని ప్రధాని మన్మోహన్ కు సోనియా గాంధీ ఆదేశించారు. కమిటీ సభ్యులను కూడా ఆమె సూచించారు. అందులో మొదటి పేరు ఆస్కార్ ఫెర్నెండేజ్ ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. సాదు స్వభావి గా పేరున్న ఫెర్నాండెజ్, కమల్ నాథ్ ల రాజకీయ నైపుణ్యం లేకున్నప్పటికీ, ప్రణబ్ ముఖర్జీ, గులాంనబీ అజాద్ లో ఎన్నికల నిర్వహణపై పట్టు లేకున్నప్పటికీ ఆమె ఫెర్నెండేజ్ పేరును సూచించడానికి కారణం అప్పగించిన బాధ్యతను అత్యంత భక్తిశ్రద్ధలతో నెరవేర్చే అతని వ్యక్తిత్వం.

చిరునవ్వుతో సవాళ్లను స్వీకరించే వ్యక్తిత్వం…

పరిపాలనా, మేథోపరమైన నైపుణ్యం మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ వంటి వారిన ప్రజా జీవితంలో అత్యున్నతస్థాయికి తీసుకెళితే, సాదు స్వభావం, సవాళ్లను స్వీకరించే తత్వం కారణంగా సోనియాగాంధీకి వి ఆస్కార్ ఫెర్నెండేజ్ విశ్వశనీయ వ్యక్తిగా ఉన్నారు. 1980లో ఉడిపి నుంచి ఎంపీగా పోటీ చేసి దిగ్గజ నాయకుడు, పెద్ద బ్యాంకర్ గా పేరున్న టోన్స్ అనంత్ పాయ్ ను ఓడించారు. సిండికేట్ బ్యాంక్ ఎదుగుదలలో టోన్స్ కీలక పాత్ర పోషించారు. కార్యకర్తలకు ఎప్పూడు అందుబాటులో ఉంటూ వారు చెప్పే విషయాలను ఓపికగా వింటూ ఫీల్డ్ లెవల్ ఫీడ్ బ్యాక్ తీసుకునే వారు ఆస్కార్ ఫెర్నాండెజ్. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో భిన్న అభిప్రాయాలున్న వారితో చర్చలు జరిపి సమన్వయం చేయడంలో ఆయన దిట్ట అని కాంగ్రెస్ నేతలు కొనియాడతారు

Show comments