ఓడ మాస్టారు విద్యార్థుల్ని చేర్చకపోతే బోడి మాస్టారు ..

చదువు చెప్పాలా ? , పిల్లల్ని చేర్పించాలా ?. అంటే

చదువు చెప్పటానికి ఉద్యోగం ఇస్తాం , పిల్లల్ని చేర్చకపోతే ఉద్యోగం తీస్తాం అన్నట్టుంది నారాయణ విద్యా సంస్థల వ్యవహారం . ఇలా అడ్మిషన్స్ చేర్చాలి అనే ఒత్తిడి గతంలోనూ ఉన్నా ఈ లాక్ డౌన్ వేల ఒత్తిడి తీవ్రతరం చేయటంతో పాటు అడ్మిషన్స్ కట్టించలేకపోయిన టీచర్స్ ని ఉద్యోగాల నుండి తొలగించడం బాధాకరం .

నారాయణ సంస్థల్లో టీచర్లుగా విద్యాబోధన చేసే వారికి ఇలా అడ్మిషన్స్ కట్టించే పనులే కాదు , విద్యాబోధనకి సంభందం లేని పలు పనులకు , ఎన్నికల ప్రచారం , పాంప్లేట్స్ డిజైన్ , పంపిణీ , డబ్బు పంపిణీ , లెక్కల నిర్వహణ , స్కూల్లో విద్యార్థుల తల్లి దండ్రుల్ని ఎన్నికల్లో టీడీపీకి ఓటేసేట్టు ప్రలోభపెట్టటం లాంటి కార్యకలాపాలకు వాడుకోవడం నారాయణ సంస్థకు కొత్తేమీ కాదు .

2014 లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎన్నికల ప్రచారం , డబ్బు పంపిణీ వీరి చేత చేయించారని పలు ఆరోపణలు ఉన్నాయి .

అయితే 2019 ఎన్నికల్లో మాత్రం నెల్లూరులో పలు చోట్ల డబ్బు , కరపత్రాలతో ఉపాధ్యాయులు దొరకగా , కొన్ని నారాయణ విద్యాసంస్థల్లో ప్రాధానోపాధ్యాయులు , పై స్థాయి అధికారులు లక్షల కొద్దీ డబ్బు ఉన్న సంచులతో , గోతాల కొద్దీ కరపత్రాలతో దొరకడం విశేషం .

టీడీపీ అభ్యర్థి నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ గెలుపు కోసం విచ్చలవిడిగా రాష్ట్రంలోనే అత్యధికంగా డబ్బు పంపిణీ జరిగిన నియోజక వర్గాల్లో ఒకటిగా పేరొందిన నెల్లూరులో అదే స్థాయిలో పలు నారాయణ స్కూల్స్ , హాస్టల్స్ , నిర్వహణా కార్యాలయాల్లో డబ్బు , కరపత్రాలతో పట్టుబడి కేసుల్లో ఇరుక్కున్న ఉద్యోగులకు సైతం నేడు ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరం .

లాక్ డౌన్ కారణంగా ఇంతవరకూ ఎక్జామ్స్ కూడా నిర్వహించని పరిస్థితుల్లో తర్వాతి విద్యా సంవత్సరానికి విద్యార్థుల్ని చేర్చలేదని ఇన్నాళ్లు అధికార ,అనధికార విధుల్ని విశ్వాసపాత్రంగా నిర్వహించిన తమని ఉన్న ఫలానా విధుల్లోనుండి తొలగించడం దారుణమని ఏప్రిల్ నెల సగం వేతనం ఇచ్చి , మే నెల అసలు చెల్లించకపోయినా మౌనంగా భరిస్తూ లాక్ డౌన్ వేల సొంత ఖర్చులతో అడ్మిషన్స్ కోసం తిరుగుతున్న తమని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తే ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ వేల తమకి ఉద్యోగం ఎవరిస్తారని పలువురు ఉపాధ్యాయిలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు .

గతంలో విద్యార్థులని తీవ్రమైన ఒత్తిడికి గురిచేయడం , కొందరు విద్యార్థుల ఆత్మహత్యలు , కొన్ని అనుమానాస్పద మరణాలు , మాదాపూర్ హాస్టల్ , హైదరాబాద్ లో మరికొన్ని హాస్టల్స్ లో వసతి , ఆహారం బాలేదని విద్యార్థుల ధర్నా చేయడం , అనుమతి లేకుండా కొన్ని బ్రాంచ్ లు ఓపెన్ చేసి విద్యార్థుల్ని చేర్చుకొన్న కేసులు నమోదు కావడం వంటి ఆరోపణలతో , చట్టవ్యతిరేకమైన చర్యలతో పలు సార్లు వివాదాస్పదమైన నారాయణ విద్యా సంస్థ మరోసారి ఉద్యోగ భద్రతని ప్రశ్నార్ధకం చేస్తూ పలువురు ఉపాధ్యాయుల్ని తొలగించి తన కార్పొరేట్ నైజాన్ని బయట పెట్టుకుంది .

Show comments