‘గద్దె’ చెబుతున్న చంద్రబాబు ఘన చరిత్ర

ఏదైనా సమూహానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి బలంగా ఉంటేనే ఆ సమూహం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలదు. నాయకుడు బలంగా ఉంటే మరింత బలంగా చేసేందుకు, బలహీనంగా ఉంటే బలంగా మార్చేందుకు ఆ సమూహంలోని వ్యక్తులు తమ వంతు కృషి చేయాలి. రాజకీయ పార్టీలకు ఈ థియరీ వర్తింపజేస్తే.. కొత్తగా లేదా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పార్టీని నిడిపిస్తున్న నాయకుడికి నేతలు, కార్యకర్తలు బలంగా మద్ధతు తెలపాలి. నాయకుడికి రక్షణ కవచంలా మారాలి. ఈగ కూడా వాలనీయకూడదు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుడే ఆ ఫలాలను అందరికీ అందిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నది ఇదే.

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డల్‌ అయ్యారు. పైగా కరోనా వైరస్‌ వల్ల ప్రజల్లోకి వచ్చేందుకు వయస్సు రీత్యా ఆయన భయపడుతున్నారు. ఫలితంగా పార్టీ పరిస్థితి అధోగతి పాలవుతోంది. జూమ్‌ మీటింగ్‌లు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే.. తమరేం చేశారని అధికార పార్టీ నాయకులు దెప్పిపొడుస్తున్నారు. తనయుడును క్షేత్రస్థాయికి పంపి విమర్శలు చేయిస్తున్నా.. బాబుకు ఎదురైన అనుభవాలే తనయుడుకు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని స్థాయికి మించి, పరుష పదజాలంతో లోకేష్‌ విమర్శిస్తుండడంతో.. వైసీపీ యువ నేతలు లోకేష్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఒకటి అంటే పది పడాల్సి వస్తోంది. తిరిగి వారిని అంటే ఎక్కడ తమ స్థాయి తగ్గిపోతుందోనని మిన్నుకుండిపోతున్నారు.

Also Read : వైయస్సార్ గురించి విప్లవ రచయిత అవంత్స ఏమన్నారు?

ఈ క్రమంలో వైసీపీ నేతల విమర్శలకు సమాధానం చెప్పేందుకు టీడీపీ నేతలు లైన్‌లోకి వస్తున్నారు. తాజాగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌.. ఇదీ మా బాబు ఘనత అంటూ చెప్పుకొస్తున్నారు. గద్దె ఇలా చెప్పడానికి దేవినేని అవినాష్‌ కారణం. వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్‌పై పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్న నారా లోకేష్‌కు వైసీపీ నేత దేవినేని అవినాష్‌ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. ఓడిపోయిన నారా లోకేష్‌ రాజకీయాలను నుంచి తప్పుకోవాలన్నారు. చంద్రబాబు తన గత పాలనను ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో అవినాష్‌కు కౌంటర్‌ ఇచ్చేందుకు, బాబు పాలన, లోకేష్‌ ఓటమిని సమర్థించేలా గద్దె రామ్మోహన్‌ మాట్లాడారు.

చంద్రబాబు, లోకేష్‌లను విమర్శించే స్థాయి అవినాష్‌కు లేదన్నారు గద్దె రామ్మోహన్‌. లోకేష్‌ ఓyì పోయారు కాబట్టి రాజకీయాల నుంచి తప్పుకోమని విమర్శించడం సరికాదన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని లోకేష్‌ను వెనకేసుకొచ్చారు. జాతీయ రాజకీయాలను కూడా చంద్రబాబు ప్రభావితం చేశారని చెప్పుకొచ్చారు. ప్రధాని, రాష్ట్రపతి ఎన్నికల్లో బాబు కీలక ప్రాత పోషించారని గద్దె రామ్మోహన్‌ ఆయన ఘనతలను చాటారు. గతంలో ఇవే మాటలు చంద్రబాబు చెప్పేవారు. తాను కేంద్రంలో చక్రం తిప్పానని, రాష్ట్రపతి, ప్రధానులను ఎంపిక చేశానని చెప్పుకునేవారు. కారణాలు ఏమిటో గానీ ఇటీవల కాలంలో ఈ మాటలు చంద్రబాబు నుంచి వినిపించడం లేదు. అయితే చంద్రబాబు బదులు ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఆ ఘనతలను చెప్పుకొస్తూ.. చంద్రబాబుకు బలం చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read : ముత్యాలపాప రాజకీయ జీవితం ముగినట్లేనా..?

Show comments