Suresh Key Comments About Visakha: రాబోయే రోజుల్లో ఓ కొత్త విశాఖ నగరాన్ని చూస్తారు: మంత్రి సురేష్

రాబోయే రోజుల్లో ఓ కొత్త విశాఖ నగరాన్ని చూస్తారు: మంత్రి సురేష్

ఏపీ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై కీలక భేటీ జరిగింది. సీఎంఓ షిప్టింగ్, కేపిటల్ ఏర్పాట్ల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మాస్టర్ ప్లాన్ పురోగతి, మెట్రో ట్రైన్ డీపీఆర్ లపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. అలానే మంత్రిత్వ శాఖల భవనాలపై అధికారుల ప్రాథమిక నివేదికపై చర్చించారు. ఈ సమావేశానికి ముందు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అధ్యక్షతన సోమవారం త్రిసభ్య కమిటీ సమావేశం అయింది. క్షేత్ర స్థాయిలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి పర్యటన జరిపారు. ఇక తాజాగా మీటింగ్  అనంతరం మంత్రి సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మంత్రి సురేష్ మాట్లాడుతూ.. సమీప భవిష్యత్తుల్లో సరికొత్త విశాఖను చూస్తామన్నారు. మెట్రో ట్రైన్ కి సంబంధించిన ప్రతిపాదనలు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న విశాఖను అత్యంత నివాస యోగమైన సిటీగా  మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణాల్లో తొలి మూడు స్థానాల్లో విశాఖ ఒకటిగా ఉందని మంత్రి సురేష్ అన్నారు. పట్టణీకరణ అనేది ఒక సమస్య కాకూడదని, అది ఓ అవకాశంగా మల్చుకోవాలని ముఖ్యమంత్రి గారి  ఆలోచన విధానం మంత్రి పేర్కొన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా  అనేకమైన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాము. రాబోయే  రోజుల్లో మీరే చూస్తారు. సరికొత్త విశాఖ నగరాన్ని ప్రజలకు చూపించబోతున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

విశాఖ నుంచి త్వరలోనే పరిపాలన కొనసాగిస్తామని సురేష్ వెల్లడించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే.. సోమవారం విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. తాను త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్టుగా స్పష్టం చేశారు. విశాఖలో పలు మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని, హైదరాబాద్,బెంగళూరు, మాదిరిగా విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందని తెలిపారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్దలు ముందుకొస్తున్నాయని అన్నారు. మరి.. మంత్రి సురేష్ తెలిపిన  ఈ కీలక అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments