కలర్స్ లో ఐటీ దాడులు

అధిక బరువు తగ్గించడం, బ్యూటీషియన్‌ వంటి రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న కలర్స్‌ హెల్త్‌ కేర్‌ బ్రాంచ్‌లపై ఐటీ అధికారులు దాడి చేశారు. ఆదాయపు పన్ను సరిగా చెల్లించడం లేదని అధికారులు గుర్తించారు. యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా స్పందించకుండా నిర్లక్ష్యం చేసింది. దీంతో కలర్స్‌ హెల్త్‌ కేర్‌ సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 49 బ్రాంచ్‌ల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్, చెన్నై నుంచి వచ్చిన రెండు ఐటి బృందాలు సోదాలు చేపట్టి  పలు కీలక పత్రాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నాయి. 

Show comments