మరికొన్ని నిమిషాల్లో పెళ్లి.. ఇంతలోనే తీవ్ర విషాదం!

జీవితం నీటి బుడగలాంటిది. ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలీదు. బంధాలతో పెనవేసుకుపోయిన జీవితాలు.. కాటికి చేరేటయానికి క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. మనిషి చనిపోయేంత వరకు తాను బాధపడి.. చావుతో.. నా అనుకున్న వాళ్లను బాధపెడతుంటాడు. అయితే, విషాదాల్లో కూడా తీవ్రమైనవి ఉంటాయి. మనిషి చనిపోవటం ఒక ఎత్తయితే.. ఆ మనిషి ఏ సందర్భంలో చనిపోయాడన్నది తీవ్రతను తెలియజేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటనలో ఓ వ్యక్తి కూతురి పెళ్లికి కొన్ని నిమిషాల ముందు చనిపోయాడు. అంత వరకు నవ్వుతూ తుళ్లుతూ తిరిగిన ఆ మనిషి అర్థాంతరంగా చనిపోవటంతో కుటుంబసభ్యులు గొళ్లుమన్నారు. కూతురి పెళ్లి ఆగిపోయింది.

ఆ వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా, అంబాల్‌పూర్‌ గ్రామానికి చెందిన ఎర్రల రాములు, మంజుల భార్య భర్తలు. వీరికి లావణ్య, కోమల, వీణ అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు లావణ్యకు జమ్మికుంటలోని శాయంపేటకు చెందిన సతీశ్‌తో పెళ్లి కుదిరింది. ఆదివారం ఉదయం 10.41కి పెళ్లి జరిగాల్సి ఉంది. మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో తాళి కట్టే శుభ మూహూర్తం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రాములు గుండె నొప్పితో కుప్పకూలాడు.

దీంతో అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. రాములు మరణంతో లావణ్య పెళ్లి ఆగిపోయింది. పెళ్లికి కొన్ని నిమిషాల ముందు తండ్రి మరణించటం.. కూతురి పెళ్లి ఆగిపోవటంతో బంధువులతో పాటు తెలిసిన వాళ్లు కన్నీటిపర్యంతం అవుతున్నారు. మరి, కూతురి పెళ్లికి కొన్ని నిమిషాల ముందు తండ్రి చనిపోయిన ఈ విషాదం సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments