Telangana Elections2023: తెలంగాణలో జనసేన,TDP పొత్తు లేదా!  ఆ భయమే కారణమా?

తెలంగాణలో జనసేన,TDP పొత్తు లేదా!  ఆ భయమే కారణమా?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి కార్యక్రమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాయి. ఇక్కడ జనసేన, టీడీపీలు కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. జనసేన అయితే ఏకంగా 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇక్కడే అందరికి ఓ ఆశ్చర్యం కలుగుతుంది. ఏపీలో పొత్తుతోనే ఎన్నికల్లోకి వెళ్తామని ప్రకటించిన జనసేన, టీడీపీలు.. తెలంగాణలో మాత్రం ఆ మాటే  ఎత్తడం లేదు. కారణం..వారికి ఓ భయమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

2024లో  ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో నవంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 32 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. ఇక్కడే అందరికి ఓ సందేహం వ్యక్తమవుతుంది. ఏపీలో కలిసి పోటీ చేయనున్న ఈ రెండు పార్టీలు తెలంగాణలో ఎందుకు చేయడం లేదని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులతో వెళ్లి గెలుస్తామనే నమ్మకం లేకనే ముందుకు సాగటం లేదనే టాక్ వినిపిస్తోంది.

ఒక వేళ జనసేన, టీడీపీ పొత్తుతో తెలంగాణలో  ఓ 50 స్థానాల్లో పోటీ చేసినా.. గెలవ పోతే.. ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటుందనే భయం ఇరుపార్టీలో ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణలో జనసేన, టీడీపీ పొత్తుతో పోటీ చేసి.. అన్ని స్థానాల్లో ఓడిపోతే మాత్రం..ఆ ప్రభావం ఏపీలో ఉంటుందనేది కొందరి వాదన. అందుకే ఏపీలో పొత్తుతో వెళ్తామని చెప్పిన పార్టీలు తెలంగాణలో మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదని, ఓటమి భయమే కారణమని పొలిటికల్ సర్కిల్ లో కామెంట్స్ వినిపిస్తోన్నాయి. మరి.. ఓటమి భయంతోనే తెలంగాణలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments