Idream media
Idream media
ముందు ఎర్రజెండా.. వెనుక పచ్చజెండా.. ఇదీ రాష్ట్రంలోని పరిస్థితి.. అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. అనవసర ఆందోళనలకు కారణమవుతున్న ప్రతిపక్షంపైనా, అందుకు సహకరిస్తున్న ఓ వర్గం మీడియాపైనా జగన్ చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. సూటిగా ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తే రాష్ట్ర సంక్షేమంపైనే కాదు.. సంక్షేమాన్ని అడ్డుకునేందుకు చేస్తున్న రాజకీయాలపైనా కూడా ఏపీ సీఎం గురిపెట్టినట్లు స్పష్టం అవుతోంది. రెండేన్నరేళ్లలో ఉద్యోగులకు తానేం చేశానో బహిరంగంగా ప్రకటించి.. విపక్షాల నోటికి తాళం వేసిన వైనం రాజకీయ పక్షాలను ఆశ్చర్యపరుస్తోంది.
ఏపీలో పీఆర్సీ పై కొద్దిరోజుల పాటు సాగిన ఆందోళనకు సీఎం జగన్ తెరదించారు. మంత్రులతో కమిటీతో సమావేశమై ఉద్యోగులు ఏం కోరుతున్నారు.. మీరేం చెప్పారు.. అనే విషయాలను తెలుసుకుని.. ఒక్కరోజులో సమస్యకు ముగింపు పలికారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనలతో ఏడుగంటల పాటు ఉద్యోగులతో మంత్రుల కమిటీ చర్చించడంతో సమస్య కొలిక్కి వచ్చింది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు రెండూ పరస్పరం అవగాహనతో ఓ మెట్టు దిగడం ద్వారా పరిష్కారం లభించింది. భవిష్యత్ లో కూడా ఏ సమస్య వచ్చినా మాట్లాడుకునేందుకు మంత్రుల కమిటీ కొనసాగుతుందని చెప్పి జగన్ ఉద్యోగుల మనసు చూరగొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే.. మీకు ఇంకా మంచి చేయాలని ఉంది అంటూ చెప్పడం ద్వారా ఉద్యోగులపై తనకున్న చిత్తశుద్ధిని తెలిపారు.
ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో సహృద్భావ వాతావరణం ఏర్పడింది. సీఎంతో పీఆర్సీ సాధన సమితి నేతల మధ్య జరిగిన చర్చలు ఫలించినట్లు.. ఇక సమస్య తీరిపోయిందని ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రుల కమిటీ సభ్యులు.. ఇరువైపులా నుంచి కూడా ప్రకటనలు వెలువడ్డాయి. ఉద్యోగ సంఘాల్లోని కీలక నేతలు..ప్రభుత్వంపై ప్రంశసలజల్లు కూడా కురిపించారు. ఉద్యోగులకు అండగా ప్రభుత్వం నిలబడిందని అన్నారు. సీఎం జగన్ కూడా ఉద్యోగులు సహకరించారని…వారు సహాయం లేనిదే ప్రభుత్వం లేదని బదులిచ్చారు. ఉద్యోగ సంఘాలు సైతం కష్టకాలంలోనూ తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుందని ఆనందం వ్యక్తం చేశారు.
సహృద్భావ వాతావరణం నచ్చక కొందరు దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. ఉద్యోగులను బెదిరించారని కొత్త వాదనలు తెరపైకి తెచ్చారు. ఉద్యోగ సంఘాల్లో వారిలో వారికే తగువులు వచ్చేలా కూడా వ్యవహరిస్తున్నారు. వీటన్నింటినీ నిశితంగా గమనించిన జగన్ తనదైన శైలిలో స్పందించారు. సమస్యలొస్తే పరిష్కరించడమే కాదు.. విపక్షాల విష ప్రచారాన్ని కూడా తిప్పికొట్టడంలో కూడా తండ్రికి మించిన తనయుడిగా గుర్తింపు పొందుతున్నారు. అందుకు ముందు ఎర్రజెండా.. వెనుక పచ్చజెండా.. అంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.
Also Read : ముందు ఎర్ర జెండా.. వెనుక పచ్చ అజెండా – తూర్పారబట్టిన సీఎం జగన్