స‌చిన్ పైల‌ట్ పార్టీ మార్పు? ఆ బీజేపీ నేత వ్యాఖ్య‌ల్లో నిజం ఎంత‌?

రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ పార్టీ మార్పుపై ఎప్ప‌టి నుంచో ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ముఖ్య‌మంత్రి అశో్క్ గెహ్లోత్ పై తిరుగుబావుటా ఎగుర‌వేసిన‌ప్ప‌టి నుంచీ ఎన్నో నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్ర‌తీ ప‌రిణామ‌క్రమంలోనూ పైల‌ట్ పార్టీ మారుతున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఇప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కీల‌క నేత ఈ విష‌యం చెప్పడం ద్వారా స‌చిన్ పైల‌ట్ పార్టీ మార్పు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కాంగ్రెస్ నుంచి బీజేపీ గూటికి చేరిన వారు చాలా మందే ఉన్నారు. అయితే ప్ర‌ధానంగా రాహుల్ అనుచ‌రులుగా చెప్పుకుంటున్న వారే పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు. గ‌తంలోఓ కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్‌కి చెందిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో బ‌ల‌మైన నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద ఇటీవ‌ల‌ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

ఇప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్‌లోనూ స్టార్ క్యాంపెయినర్‌గా ఎదిగిన సచిన్ పైలట్ సైతం పార్టీని వీడతారన్న ప్రచారం మ‌రోసారి ఊపందుకుంది. భవిష్యత్తులో ఆయన తమ పార్టీలో చేరవచ్చంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రాజస్థాన్ బీజేపీ చీఫ్ ఏపీ అబ్దుల్ కుట్టి తాజాగా సంకేతాలిచ్చారు.

సచిన్ పైలట్ మంచి నేత.. రాజస్థాన్ కాంగ్రెస్ భవిష్యత్తు నేత భవిష్యత్ సీఎం.. భవిష్యత్తులో ఆయన బీజేపీలో చేరుతారని తాను అనుకుంటున్నానని అబ్దుల్ తాజాగా సంకేతాలిచ్చారు. సచిన్ పైలట్ మంచి నేత అని.. భవిష్యత్తులో ఆయన బీజేపీలో చేరుతారని తాను అనుకుంటున్నానని చెప్పారు. గత ఏడాది పైలట్ ఆయనకు విధేయులైన 18మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై తిరుగుబాటు చేయడంతో పైలట్ బీజేపీలోకి వస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆ ఊహాగానాలను పైలట్ తోసిపుచ్చారు. అలాంటి ఆలోచన లేదని వివరణ ఇచ్చారు.

గతంలోనే సచిన్ పైలట్ కాంగ్రెస్ లో అసమ్మతి రాజేసారు. రాజస్థాన్ కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేలా ప్రయత్నించారు. సచిన్ పైలెట్ ను రప్పించి మెప్పించి కాంగ్రెస్ లోనే ఉండేటట్టు చేసింది కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీనే అన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలకుండా ఉండేటట్టు కాపాడింది ప్రియాంకగాంధీనే అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.సచిన్ పైలట్ కు ప్రస్తుతం పాత పదవులు ఇచ్చేటట్టు అతడి మద్దతుదారులైన ఎమ్మెల్యేలకు కొన్ని మంత్రి పదవులు ఇచ్చేటట్టు ప్రియాంక గాంధీ ఒప్పించినట్టు తెలిసింది. అలాగే వచ్చే ఎన్నికల క్యాంపెయిన్ అంతా సచిన్ పైలెట్ కు అప్పజెప్పి గెలిస్తే సీఎంను చేస్తాము అని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం.

ప్రియాంక హామీతోనే సచిన్ కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. తాజాగా మరోసారి సచిన్ పార్టీ మార్పుపై ఈ ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. ఈనెలలోనే గెహ్లాట్ మంత్రివర్గ విస్తరణతోపాటు రాజకీయ నియామకాలు చేపట్టనున్నారు. తాను లేవనెత్తిన అంశాలపై పార్టీ సరైన చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నట్టు సచిన్ పైలట్ గత నెలలో వ్యాఖ్యానించారు.

Show comments