పీకే.. మోదీకి న‌మ్మిన బంటు అట‌! మ‌రి కాంగ్రెస్ కు..?

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. రాజ‌కీయ నాయ‌కుడిగా మారుదాం అనుకునేస‌రికి.. ఆయ‌న‌పై కొత్త త‌ర‌హా ఆరోప‌ణ‌లు పుట్టుకొస్తున్నాయి. పీకే ను న‌మ్ముకుని గ‌ట్టెక్కుదామ‌నుకుంటున్న కాంగ్రెస్ ఆయ‌న‌పై వ‌స్తున్న ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు స‌రికొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న‌ను పార్టీలోకి చేర్చుకుని ఆయ‌న చెప్పిన‌ట్టు వింటూ పూర్వ వైభ‌వం సంపాదించుకునేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మ‌రి కొంద‌రు సీనియ‌ర్లు లేవ‌నెత్తుతున్న అనుమానాలు సంక‌ట స్థితిలో ప‌డేస్తున్నాయి. ఇది వారి మాటేనా? బీజేపీ చెప్పిస్తోందా? అనే అనుమానాలూ లేక‌పోలేదు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..

దేశ రాజకీయ తెరమీదకు వ్యూహకర్తగా అడుగు పెట్టిన ప్రశాంత్ కిశోర్.. 2014 ఎన్నికల్లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ఢిల్లీ పీఠం లో కూర్చోబెట్టడమే లక్ష్యంగా పనిచేశారు. ఈ క్రమంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత.. ఆ తర్వాత బీహార్లో నితీశ్ కుమార్ కు ,పంజాబ్లో అమరేందర్ సింగ్ ,ఏపీలో జగన్ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేసి సక్సెస్ సాధించారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని మళ్లీ సీఎం సీటులో కూర్చోబెట్టి తన సత్తా చాటుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్ సేవలను కాంగ్రెస్ వాడుకుని.. ఆయన వ్యూహాల మేరకు అడుగులు వేయడం ద్వారా.. వచ్చే 2024 ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అవకాశం ఉందని.. రాహుల్ భావిస్తు న్నారు. మరోవైపు.. పలువురు ప్రతిపక్ష నాయకులు కూడా ఇదే సూచిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఏకంగా.. ఆయనను పార్టీలో చేర్చుకుని.. కీలకమైన పదవి ఇచ్చి.. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేయాలనేది.. రాహుల్ యోచనా ఉంది. ఈ క్రమంలో ఆయన సీనియర్లతో మంతనాలు చేస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోదీ సర్కారుపై వ్యతిరేకత పెరుగుతున్న మాట వాస్తవం. అయితే.. కాంగ్రెస్ కు సానుభూతి పెరుగుతోం దా? అంటే.. లేదనే చెప్పాలి. ఒకవేళ పెరిగినా.. దానిని సరిగా క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు దూకుడుగా వ్యవహ రించడం లేదు. దీనిని సరిచేయకుండానే ప్రశాంత్ కిశోర్ను తీసుకువచ్చి.. పార్టీని పట్టాలెక్కించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నా రు. ఇక ప్రశాంత్ విషయానికి వస్తే.. ఆయన ఇటీవల కాలంలో బీజేపీని విమర్శిస్తున్నారు. బీజేపీని గద్దెదించడమే లక్ష్యమని.. ప్రచారం చేస్తున్నారు.

కేవలం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటివారితోనే ప్రశాంత్ కిశోర్కు వ్యతిరేకత ఉందని.. చెబుతున్నారు. అంతేకాదు.. 2014లో అసలు ప్రశాంత్ కిశోర్ను రాజకీయ తెరమీదికి తీసుకువచ్చిందే.. ప్రధాని అనే విషయాన్ని మరిచిపోరాదని హెచ్చరిస్తున్నారు. అంటే.. ఆయన మోడీ వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పుంజుకోకుండా చేసే వ్యూహంలో భాగంగానే.. మోడీ కనుసన్నల్లోనే కాంగ్రెస్కు వ్యూహకర్తగా మారుతున్నారనేది వీరి వాదన. ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్లోకి వచ్చినా.. ఆయనను నమ్ముకుంటే.. కష్టమని.. ఆయన వ్యూహాలతో కాంగ్రెస్ పుంజుకోకపోగా.. మోడీపై వ్యతిరేకతను కూడా గెయిన్ చేసుకునే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్ కు చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. దేశంలో మోదీ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయన శిష్యుడుగా తెరమీదికి వచ్చిన ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్లోకి వచ్చినా.. ఆయన అనుంగుగానే పనిచేస్తారని ఒక వర్గం ప్రచారంచేస్తుంది. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ మమతను ఓడించాలన్న బీజేపీ వ్యూహాన్ని లోపాయికారీగా ప్రశాంత్ అమలు చేశారని.. నందిగ్రామ్ నియోజకవర్గంలో ఆమె ఓడిపోవడం.. బీజేపీ నాయకుడు సుబేందు అధికారి విజయం దక్కించుకోవడం వెనుక ఇదే రీజన్ ఉందని బీజేపీకి సన్నిహితంగా ఉండే మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ కు దగ్గర కానీయకుండా చేయటానికే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని భావిస్తున్నారు. 2014 నుంచి 5,6 ఎన్నికల్లో వివిధ పార్టీల కోసం పనిచేసినా రాని ఆరోపణలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయంట ప్రశాంత్ కిషోర్ నిబద్దత మీద అనుమానాలు పుట్టివుంచి ఒక బిజెపి వ్యతిరేక వర్గాలను ఏకంగా చెయ్యటానికి ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే ప్రశాంత్ కిషోర్ మోడీకి సన్నిహితుడు అంటూ ప్రచారం చేస్తున్నారని సీనియర్లు భావిస్తున్నారు.

Show comments