జగన్ ను చూసి నేర్చుకోవాలి – ఇండియా టుడే అక్షిత

కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియాకు ఇప్పటికైనా బుద్ధి వస్తుందా ? ఎందుకంటే వైరస్ ను ఎదుర్కోవటంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న విధానాలపై తాజాగా ఇండియా టు డే యాంకర్ అక్షితా నందగోపాల్ ఓ ట్వీట్ చేసింది. తన ట్వీట్లో ఏపిలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలను చూసి తెలంగాణా సిఎం కేసీయార్ నేర్చుకోవాలంటూ స్పష్టంగా తేల్చి చెప్పింది. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎటువంటి పద్దతులు అనుసరిస్తున్నారన్న విషయంపై వివరాలు తెప్పించుకునే అక్షిత ట్వీట్ చేసినట్లుంది.

వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో ఏపిని చూసి తెలంగాణా ఒకటి రెండు విషయాలను నేర్చుకోవాలని యాంకర్ చెప్పింది. సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయం మీడియా సమావేశాల్లో చాలా పెద్ద పెద్ద మాటలను చెప్పిందంటూ అక్షిత ఎద్దేవా చేసింది. కేసీయార్ పేరు ప్రస్తావించకుండా సిఎంవో అని చెప్పటం గమనార్హం. కరోనా విషయంలో తెలంగాణా ప్రభుత్వం మరచిపోయిన అంశాల్లో వైరస్ నిర్ధారణ టెస్టులు చేయకపోవటం, డాక్టర్లకు అవసమైన రక్షిత పరికరాలు అందించే ప్రధాన విషయాలను మాత్రం మరచిపోయిందంటూ దెప్పి పొడిచింది. తన ట్వీట్ ను మంత్రి కేటియార్ తో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్రను కూడా ట్యాగ్ చేయటం గమనార్హం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైరస్ ను ఎదుర్కోవటంలో జగన్ ప్రభుత్వం ఫెయిలైందంటూ చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా గోల చేయని రోజు లేదు. వైరస్ సంక్షోభం మొదలైన కొత్తల్లో టెస్టులు చేయటం లేదని గోల చేశారు. టెస్టులు చేయటం మొదలుపెట్టగానే కేసులు పెరిగిపోతున్నాయంటూ యాగీ చేశారు. ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేస్తున్నా ప్రభుత్వం వైరస్ ను నిర్లక్ష్యం చేస్తోందంటూ ఎల్లోమీడియాలో పిచ్చి రాతలు రాయించారు. సరే ఎవరెన్ని ఆరోపణలు చేసినా, విమర్శలు చేసినా, రాతలు రాసినా జగన్ మాత్ర దేన్ని పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుపోతున్నాడు.

జగన్ సర్కార్ ఫెయిలైందని ముద్ర వేసేందుకు చంద్రబాబుతో పాటు కొన్ని ప్రతిపక్షాల నేతలు పెద్ద ఎత్తున కష్టపడ్డారు. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో గమనిస్తున్న జనాలు మాత్రం ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు స్పందించలేదు. మొత్తానికి వైరస్ ను ఎదుర్కోవటంలో జగన్ తీసుకుంటున్న చర్యలను రాష్ట్రంలో ఎల్లోమీడియా మీడియా గుర్తించకపోయినా జాతీయ మీడియా మాత్రం బాగా గుర్తించింది.

Show comments