Nithya Menen మ‌ల‌యాళం హీరో ప్రేమ‌లో నిత్యామీన‌న్, త్వరలో పెళ్లి?

నిత్యా మీనన్ త్వరలో ప్రముఖ మలయాళ హీరోతో పెళ్లి చేసుకోబోతోందని టాలీవుడ్ , మాలీవుడ్‌లో గ‌ట్టిగా ప్రచారం మొదలైంది. సినిమా స‌ర్కిల్స్ ఇది నిజ‌మేన‌ని అంటున్నాయి. సినిమాల్లోకి రాక‌ముందే, టీనేజ‌ర్ గా ఉన్న‌ప్ప‌టి నుంచే, స్టార్‌తో స్నేహంగా ఉందని, చివరికి ఆ సంబంధం ప్రేమ‌గా మారింద‌న్న‌ది ఆమె స‌న్నిహితుల మాట‌. మ‌రి నిత్య ప్రేమికుడు ఎవ‌రు? నిత్య‌కాని, ఆమె వ్య‌క్తిగ‌త సిబ్బందికాని బైట‌పెట్ట‌డంలేదు. హింట్ ఏంటంటే, అత‌ను మాలీవుడ్‌లోని అతిపెద్ద స్టార్‌లలో ఒకడు. ఇద్ద‌రూ రెండు కుటుంబాల‌కు ఒప్పించి వివాహం చేసుకోనున్నారు.

నిత్యా మీనన్ , విజయ్ సేతుపతితో నటించిన లీగల్ డ్రామా ’19 (1) (ఎ)’ త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘తిరుచిత్రంబలం’లో ధనుష్ కథానాయికల్లో ఆమె కూడా ఒకరే. ఈ ఆగస్టు 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ త‌రం హీరోయిన‌ల్లో, నిత్య‌మీన‌న్ కు పాన్ ఇండియ‌న్ టాలెంటెడ్ యాక్ట్ర‌స్ గా పేరుంది. మ‌ళ‌యాలం, క‌న్న‌డ‌, త‌మిళం, తెలుగు సినిమాల్లో న‌టించారు. మ‌ణిర‌త్నం ఒకే బంగారంగా తెలుగులో వ‌చ్చిన OK Kanmani మంచి పేరుతెచ్చింది. విజ‌య్ సినిమా (Thalapathy Vijay) అదిరింది ( Mersal)మూవీలో కీల‌క పాత్ర పోషించారు. ఇక డాన్స్ మాస్ట‌ర్ లారెన్స్ (Raghava Lawrence) కాంచ‌న (Kanchana 3)లో భ‌య‌పెట్టారు.

Show comments