గవర్నర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘ కాలం గవర్నర్ గా పని చేసిన నరసింహ రావు తరువాత నవ్యాంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా ఒడిషాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ జులై 24, 2019లో నియమితులు అయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన బిశ్వభూషణ్ హరించందన్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. 1953 రాష్ట్రం ఏర్పడిన నుంచి 2019 మధ్య 22 మంది గవర్నర్లుగా పని చేయగా బిశ్వభూషణ్ హరిచందన్ 23వ గవర్నర్ గా నియమితులయ్యారు.రెండు సంవత్సరాల గవర్నర్ పదవి కాలం పూర్తి చేసుకున్న బిశ్వభూషన్ గారు నేటితో 87 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్నారు.గవర్నర్ పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

బిశ్వభూషణ్ రాజకీయ ప్రస్థానం..

అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిలక పేరుతో 1977 ఏర్పడ్డ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున ఒరిస్సా శాసనసభకు బిశ్వభూషణ్ తొలిసారిగా ఎన్నికయ్యారు. జనతా పార్టీ తరఫున చట్టసభలకు ఎన్నికైన బిశ్వభూషణ్ జనతా ప్రయోగం విఫలం అయిన తర్వాత వాజ్ పేయ్ అధ్యక్షుడిగా 1980లో ఏర్పడిన బీజేపీలో చేరారు. బిజెపి తరఫున 1980 శాసనసభ ఎన్నికల్లో గెలిచిన బిశ్వభూషణ్ 1985 ఎన్నికలలో ఓడిపోయారు.

తర్వాత 1988లో వీపీ సింగ్ ఏర్పాటు చేసిన జనతాదళ్ లో చేరి1990 ఎన్నికల్లో గెలిచారు. 1990 లో వీపీ సింగ్ ప్రభుత్వం కూలిపోవడంతో చంద్రశేఖర్ జనతాదళ్ వీడి సమాజ్ వాది జనతా పార్టీ రాష్ట్రీయ SJP(R) పేరుతో పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ మద్దతు ప్రధాని అయ్యారు. 1994లో జనతాదళ్ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన బిశ్వభూషణ్ తర్వాత ఏర్పాటు చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన సమాజ్వాది జనతా పార్టీ రాష్ట్రయలో చేరి 1995 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. బిజెపి, జనతాదళ్, సమాజ్ వాదీ జనతా పార్టీ రాష్ట్రియ పార్టీలు ఏర్పాటు అయినా తరువాత అపార్టీలు పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో మూడు పార్టీల తరఫున పోటీ చేసిన రికార్డ్ బిశ్వభూషణ్ సొంతం. తర్వాత 1996 లో బిజెపిలో చేరారు బిశ్వభూషణ్. తరువాత ఒరిస్సాలో 1997లో బిజూపట్నాయక్ నేతృత్వంలో BJD పార్టీ ఏర్పాటు అయిన బిశ్వభూషణ్ BJD లోకి వెళ్ళలేదు.

2000 ఎన్నికలలో బిశ్వభూషణ్ తన సోదరుడు బిభూతి భూషణ్ ను చిల్కా నియోజకవర్గం నుంచి పోటీ చేయించి తాను భువనేశ్వర్ స్థానానికి మారారు. ఆ ఎన్నికల్లో ఇద్దరు గెలిచారు తర్వాత 2004 ఎన్నికల్లో కూడా సోదరులిద్దరూ గెలిచారు. 2005 నవీన్ పట్నాయక్ కాబినెట్ లో పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసారు. కానీ 2009 ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు. 2014 ఎన్నికల నుంచి రాజకీయ రిటైర్మెంట్ తీసుకున్న బిశ్వభూషణ్ తన కొడుకు పృథ్వి రాజ్ హరిచందన్ ను భువనేశ్వర్ నుంచి లోక్ సభ బరిలో దించారు. ఈ ఎన్నికలో పృథ్వి రాజ్ హరిచందన్ ఓటమి పాలయ్యారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ పాలన కొనసాగిస్తూన్నారు గవర్నర్.తనకున్న అధికారలతో అవసరమైన సందర్భాలలో ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లుల మీద, పరిపాలన మీద సలహాలు సూచనలు ముందుకు సాగుతున్నారు.

Show comments