అక్కడికెళ్ళాలంటే భయమేత్తోంది బా..!

..బా.. బావా.. బావా నిన్నే వినపడుతుందా.. అక్కడకెళ్ళాలంటే భయమేస్తోంది బా.. అంటూ అరుస్తున్నాడు మణిగాడు. వాడి పక్కనే భౌతిక దూరం పాటిస్తూ ఆదివారం పుస్తకం చదివే పనిలో బిజీగా ఉన్నాడు కిట్టయ్య.

వినపడుతుందా బావా.. నేను గొంతు చించుకుంటుంటే ఏమీ పట్టనట్టు పుస్తకంలో మునిగిపోయావేంటీ.. అంటూ చిరాకుపడ్డాడు మణి. ఏంట్రాబాబూ మళ్ళీ ఏం పట్టుకొచ్చావ్‌.. అంటూ పుస్తకంలో నుంచి తలపైకెత్తాడు కిట్టయ్య.

అదే బావా వైజాగ్‌ వెళ్ళాలంటే భయమేస్తోంది బావా అన్నాడు మణి. ఏంట్రోయ్‌ అదేమన్నా పాకిస్థానా, ఆఫ్ఘనిస్థానా గట్టిగా రెండున్నర గంటలు ఎక్సలేటర్‌ తొక్కితే చల్లటి సముద్రం గాలి పీల్చేసుకోవచ్చు.. అయినా అంత భయపడిపోవడానికి అక్కడేముందిరా అన్నాడు కిట్టయ్య.

ఏం లేదుబావా ఈ మధ్యన ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను చూస్తున్నాం, దీంతో పాటు కొన్ని టీవీల్లో చంద్రబాబునాయు అండ్‌ బందం మాట్లాడే మాటలు వింటున్నా.. అందుకే ఈ భయం పట్టుకుంది బా అన్నాడు.

ఓహో అదా సంగతి అంటూ చెప్పడం మొదలెట్టాడు కిట్టయ్య.. ఏం లేదురా అమరావతిని హైలెట్‌ చేయడానికి పాపం అమాయకమైన వైజాగ్‌కు అన్యాయం చేస్తున్నార్రా వాళ్ళంతా అన్నాడు. అదెలాగంటావ్‌ బావా అంటూ కిట్టయ్య మాటకు అడ్డొచ్చాడు మణి.

చెబుతానుండ్రా.. అంటూ మళ్ళీ ప్రారంభించాడు కిట్టయ్య.. పదవిలో ఉన్న అయిదేళ్ళు విశాఖ కేంద్రంగానే చంద్రబాబు నాయుడు పరిపాలన సాగింది. పెట్టుబడుల సదస్సుల నుంచి సమస్తం విశాఖ నుంచే నిర్వహించేవారు. అంతే కాకుండా విశాఖ సిటీలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు కూడా టీడీపీనే గెల్చుకుంది. ఉత్తరాంధ్రకు కీలకమైన విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక రకంగా టీడీపీకి కంచుకోటగా ఉండేవి. అయితే జగన్‌ ప్రభంజనంలో అవన్నీ దాదాపు తలక్రిందులైపోయాయి. ఇదంతా అందరికీ తెలిసిన చరిత్రే.

అయితే తెరవెనుక నడిచేది మరొకటి ఉంది. ఎగ్జిక్యూటివ్‌ కేపిల్‌గా విశాఖ సిటీని సీయం జగన్‌ ప్రకటించారు. ఆయన నిర్ణయం తప్పు, ఆ సిటీలో అంతా అస్తవ్యస్థం, అన్నీ ఆరాచకాలే అని పదేపదే లేనిదాన్ని చెబూతూ జనాల బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం ఇప్పుడు టీడీపీ బందం చేస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు, ఆయన బందం, పత్రికలు, టీవీ ఛానళ్ళు విశాఖలో అదేదో జరిగిపోతుంది, ఇదేదో అయిపోతోంది, పేలిపోద్ది, కూలిపోద్ది, సముద్రదంలోకి జారిపోద్ది, సునామీయే వచ్చేస్తుంది.. అంటూ మొదలు పెట్టి, కొనసాగిస్తున్నారు. వీళ్ళకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకంటే.. తమకు శత్రువులుగా భావించిన వారిపైన బురదజల్లడమే ప్రధానం..

నువ్వు ఈ మధ్యన వీళ్ళ టీవీలు, పత్రిలకు, నాయకుల మాటలు మాత్రమే వింటున్నానన్నావు కదా? అందుకే నీకు వైజాగ్‌ అంటే భయం పట్టుకుందిరా మణీ అంటూ ముగించాడు కిట్టయ్య.

బావా నేనే పెద్ద ముదురుని అనుకుంటాను కదా? నాకే ఇలా భయం వచ్చేస్తే సామాన్యుల సంగతి ఏంటంటావ్‌ అన్నాడు మణి.

నువ్వేమీ సందేహాలు పెట్టుకోకురా మణీ.. ప్రజలు మహాముదుర్లు వాళ్ళకు అన్నీ తెలుసు, అన్నిటి మీదా, అందరి మీదా పిచ్చ క్లారిటీగా ఉంటారు.. వాళ్ళ సమయం వచ్చినప్పుడు తమ సత్తాను చూపుతారు. మొన్న 2019లో అదేగా చేసారు అన్నాడు కిట్టయ్య.

అలాగైతే పర్లేదు బావా.. నేను ఏ మాత్రం భయం లేకుండా వైజాగ్‌ వెళ్ళొచ్చంటావ్‌ అంటూ ఇంటికి బయలుదేరాడు మణి.

Show comments