YS Jagan In Yemmiganur: 52 నెలల పాలనలో ఆ మాట నిలబెట్టుకున్నాం: CM జగన్

52 నెలల పాలనలో ఆ మాట నిలబెట్టుకున్నాం: CM జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి.. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. జగన్ పరిపాలన మెచ్చిన జనం మరోసారి ఆయననే గెలిపించుకుంటామని వివిధ సర్వేల ద్వారా స్పష్టం చేశారు. కుల, మత, భేదాలు చూపించకుండా.. అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. అమ్మఒడి, జగనన్న చేయుత, రైతు భరోసా వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. తరచూ బటన్ నొక్కుతు లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నారు. తాజాగా జగనన్న చేదోడు పథకంలో భాగంగా నాలుగో విడత నిధులను విడుదల చేశారు. ఇందుకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం వేదికైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ  52 నెలల పాలనలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాన్ని సీఎం తెలిపారు.

గురువారం జగనన్న చేదోడు నిధుల జమ కార్యక్రమం కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీఎం జగన్ పర్యటించారు.  బటన్ నొక్కి జగనన్న చేదోడు సాయం సీఎం జగన్ అందచేశారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు అందజేస్తున్నామని తెలిపారు.  ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు వచ్చి చేరుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతీ అడుగులో వెనుకబడిన వర్గాల చేయి పట్టుకుని నడిపిస్తున్నామని, వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.19178 కోట్లు అందజేస్తున్నామని సీఎం తెలిపారు.

సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ..”వెనుబడిన కులాలను, వర్గాలను వెన్నెముక మాదిరిగా దృఢంగా మారుస్తామని పాదయాత్ర సందర్భంగా ఏదైతే మాట ఇచ్చామో..  ఈ రోజు నేను మీ బిడ్డగా, అన్నగా, తమ్ముడిగా నిల బెట్టుడుకున్నానని సగర్వంగా చెబుతాను. ఈ 52  నెలల పరిపాలనలో నవరత్నాల్లోని ప్రతీ ఒక్క కార్యక్రమం ద్వారా నా ఎస్సీలను, నా ఎస్టీలను, బీసీనలను, నా మైనార్టీలను , నా నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగాను. వారి జీవిత ప్రయాణంలో తోడుగా ఉండగలిగానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను” అని సీఎం జగన్ తెలిపారు. మరి.. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments