చిదంబరానికి మరిన్ని చిక్కులు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో అరెస్ట్‌ అయ్యి సెప్టెంబరు 5 నుంచి తీహార్‌ జైల్లో గడుపుతున్న చిదంబరానికి బెయిల్‌ విషయంలో ఢిల్లీ సీబిఐ కోర్టులో ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనను రేపు (బుధవారం) ఈడీ అధికారులు అరెస్ట్‌ చేయనున్నారు. తీహార్‌ జైల్లో ప్రశ్నించిన అనంతరం ఆయనను అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఈడీకి ఢిల్లీ కోర్టు అనుమతిని మంజూరు చేసింది. ఒక వైపు సిబిఐ, ఇంకో వైపు ఈడీ ఇలా వరుస కేసులతో చిదంబరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తాజాగా స్పెషల్ కోర్టు ఆదేశాలతో చిదంబరం మరిన్ని చిక్కుల్లో పడినట్లయింది. 

Show comments