కీలక రిపేర్లలో వకీల్ సాబ్ ?

లాక్ డౌన్ వల్ల రెండున్నర నెలలుగా షూటింగులు ఆగిపోయి స్టార్లు ఇంటికే పరిమితమైన తరుణంలో ఒక్కొక్కరుగా బయటికి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటిదాకా మొదలైంది రవిబాబు సినిమా ఒక్కటే. ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మీద ఉంది. ఇంకో నెల రోజులు ఏకధాటిగా కొనసాగితే పూర్తయిపోతుంది. ఎలాగూ ఆల్రెడీ షూట్ చేసిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఫైనల్ షాట్ కాగానే తక్కువ టైంలోనే ఫస్ట్ కాపీ రెడీ చేయొచ్చు . ఇంకా అసలైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాలన్స్ ఉంది. ఈ పార్ట్ కి హీరోయిన్ కావాలి. ముందు శృతి హాసన్ అన్నారు. ఏదో సోషల్ మీడియా చాట్ లో నేను లేను అని చెప్పింది.

తాజా అప్డేట్ ప్రకారం మరికొన్ని సంప్రదింపుల తర్వాత ఓకే చేసిందట. కేవలం 11 రోజుల షూట్ కు గాను 50 లక్షల పారితోషికం ఆఫర్ చేసినట్టు ఫిలిం నగర్ టాక్. ఇది నిజమో కాదో ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రస్తుతానికి యూనిట్ నుంచి కానీ దర్శకుడి నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచి సెట్లో పాల్గొంటాడు అనే దాని గురించి క్లారిటీ లేదు. అసలే హైదరాబాద్ లో కరోనా ఇంకా అదుపులోకి రాలేదు. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో సీనియర్ స్టార్లు బయటికి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అందులోనూ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ప్రభుత్వ నిబంధనలు ఎంత పాటించినా మన అదుపులో ఉండని కొన్ని ఫ్యాక్టర్స్ అప్పటికప్పుడు ఎదురు కావొచ్చు.

అందుకే ఇంకోద్దిరోజులు వేచి చూద్దామనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. మరోవైపు అభిమానుల కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని కాస్త తగ్గించి ఇప్పటికే తీసిన ఫైట్ తో పాటు మరో చిన్న యాక్షన్ బ్లాక్ జోడించేలా స్క్రిప్ట్ లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు సమాచారం. సీరియస్ కోర్ట్ డ్రామా కావడంతో వాటిని కూడా కుదిస్తారట. మొత్తానికి వకీల్ సాబ్ కు సంబంధించిన వర్క్ అయితే జరుగుతోంది. మరి దసరాకు రిలీజ్ చేస్తారా లేక 2021 సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటారా అనేది వేచి చూడాలి. జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఎవరూ ఏదీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఆగస్ట్ లో వకీల్ సాబ్ మళ్ళీ స్పాట్ కు వచ్చే అవకాశం ఉంది.

Show comments