Idream media
Idream media
గుంటూరు జిల్లా టీడీపీ నేత, నరసరావు పేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్‌ట్రాయ్ కంపెనీ, ఆయన ఇళ్లలో సీబీఐ సోదాలు చేస్తోంది. బ్యాంకు రుణాల ఎగవేత కేసు నేపథ్యంలో సీబీఐ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి 500 కోట్ల రూపాయలు ఋణం తీసుకుని మొహం చాటేయడంతో ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఇండియన్ బ్యాంకు ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ ఈ రోజు ఉదయం నుంచి రాయపాటి సాంబశివరావు ఇళ్లలోనూ, హైదరాబాద్, గుంటూరు, బెంగుళూరు నగరాల్లోని ట్రాన్స్‌ట్రాయ్ కార్యాలయాల్లోనూ ఏకకాలంలో సోదాలు చేస్తోంది. కాగా, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరం కాంట్రాక్టు పనులు దక్కించుని, ఆ పై పనులు చేయలేక చేతులెత్తేసిన సంగతి తెలిసిందే.
సీబీఐ అధికారులు వచ్చిన సమయంలో రాయపాటి ఇంట్లో లేరని సమాచారం. దింతో సిబిఐ అధికారులు ఆయన కుమారుడు రంగబాబు తో మాట్లాడుతున్నారు.