ఒక్కోసారి రాజకీయాల్లో చేసే తప్పులు కొత్త కొత్త తలనొప్పులు తెస్తూ ఉంటాయి. సరిగ్గా దీపావళి ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా బీజేపీకి తలనొప్పిగా మారింది. సరిగ్గా దీపావళి ముందు రోజు పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభవార్త చెబుతున్నామని చెబుతూ పెట్రోల్ మీద ఐదు రూపాయలు,డీజిల్ మీద పది రూపాయలు చార్జీలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఇలా తీసుకోవడం వెనుక, ముందు ఎలాంటి దురుద్దేశం లేవని అందరూ భావించారు.కానీ ఇలా తగ్గించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేట్లు తగ్గించాలని డిమాండ్ చేయించే కొత్త వ్యూహం ఉందనే విషయాన్ని రెండు మూడు రోజులకు గానీ ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు.. నిజానికి విరివిగా పెరుగుతున్న పెట్రోల్,డీజిల్ రేట్లు గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే దానికి బీజేపీ ముసుగు వేసుకున్న కొందరు సోషల్ మీడియా వీరులు కూడా గత యూపీఏ ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీరుస్తుందని కవర్ చేసుకుంటూ వచ్చేవారు.
Also Read : Chandrababu,Jagan-మా బాబే..! జగన్ దుబారా వల్లే పెట్రో ధరలు పెరిగాయట!
యూపీఏ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసింది? మోడీ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు తీర్చిందో లెక్కలు మాత్రం ఎవరూ చెప్పరు. అయితే అనూహ్యంగా పండుగ ముందు రేట్లు తగ్గించడమే కాక బీజేపీ పాలిత రాష్ట్రాల అన్నింటిలో కూడా రేట్లు తగ్గించేలా ప్రకటన చేయించారు. తద్వారా బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణులను రెచ్చగొట్టి రాష్ట్ర ప్రభుత్వాలు రేట్లు తగ్గించాలని ధర్నాలు చేయించే పెద్ద ప్లానే వేశారు. అయితే ఇక్కడే బీజేపీ ప్రభుత్వం కొత్త కష్టాలు కొనక్కొచ్చుకున్నట్లు అయింది. ఎందుకంటే అంతకు ముందు వరకు సోషల్ మీడియాలో సామాన్య వ్యక్తులు రేట్లు గురించి స్పందించే వారు కానీ ఇలా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వాలు స్వయానా స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
వైఎస్ జగన్ పత్రికాముఖంగా దాదాపు అన్ని పత్రికల నుంచి ఏది నిజం, ఏది భ్రమ అనే విషయం మీద ప్రకటనలు ఇస్తే కేసీఆర్ అయితే సన్నాసులు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలలో ఎవరు ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత గా ఉండడానికి చూస్తారు. కానీ దాన్ని అలుసుగా తీసుకుని ఇంకెన్నో చేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఏ రాష్ట్ర అధినేత కూడా వెనుకడుగు వేయరు. ఇదే పరిస్థితిని బీజేపీ ఒక లాగా వాడుకుందామని చూస్తే పరిస్థితులు మాత్రం తారుమారయ్యాయి. సరిగ్గా 2014లో మోదీ గద్దెనెక్కక ముందు ఉన్న రేట్లు ఇప్పుడు ఉన్న రేట్లను గనక పరిశీలించి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు మోడీ ప్రభుత్వం ప్రవర్తించడమే గాక బీజేపీ యేతర రాష్ట్రాల్లో తమ తమ నాయకులను రెచ్చగొట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద నిరసన కార్యక్రమాలు చేయిస్తే మాత్రం ఉపయోగం ఏమిటి?
Also Read : Liquor, Petrol – మద్యం, పెట్రోలు… రెండూ ఒకటేనా సోము…?