కర్నూల్ జెడ్పీ పీఠం ‘మల్కిరెడ్డి’దే.. అనూహ్యంగా తెర మీదకు

  • Updated - 10:40 PM, Fri - 11 March 22
కర్నూల్ జెడ్పీ పీఠం ‘మల్కిరెడ్డి’దే.. అనూహ్యంగా తెర మీదకు

ఏపీలో 13 జిల్లాలకు జిల్లా పరిషత్‌ చైర్మన్ ల ఎంపిక పూర్తయింది. ఇప్పటికే అన్ని స్థానాలను అధికార వైసీపీ కైవసం చేసుకుంది. ఇక కర్నూలు జిల్లా 14వ చైర్మన్‌గా సంజామల జెడ్పీటీసీ ఎం.వెంకటసుబ్బారెడ్డి ఎన్నిక అయ్యారు. ఆయన ఎంపిక ముందే ఖరారైంది. ఇక జెడ్పీ చైర్మన్‌గా ఎం.వెంకట సుబ్బారెడ్డి ఎన్నిక కావడం అంత ఈజీగా జరగలేదు. ఎందుకంటే నిజానికి జిల్లాలో 53 జెడ్పీటీసీ స్థానాలకు 16 ఏకగ్రీవమయ్యాయి, 36 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అన్నిచోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. విజేతల్లో చాలా మంది జెడ్పీ పీఠంపై దృష్టి సారించారు. అయితే ఏకగ్రీవమైన 16 జెడ్పీటీసీల్లో కొలిమిగుండ్ల మండలం యర్రబోతుల వెంకటరెడ్డికి జెడ్పీ ఛైర్మన్‌ పదవి ఇచ్చేందుకు గతంలోనే అధిష్ఠానం నిర్ణయించింది.

Also Read : త్యాగానికి జగన్ పట్టం : కడప జడ్పీ చైర్మన్ గా ఆకేపాటి

కొలిమిగుండ్ల జడ్పీటీసీ ఎర్రబోతుల వెంకటరెడ్డిని జెడ్పీీీీీ చైర్మన్‌గా గతంలోనే వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. అయితే ఆయన అనూహ్యంగా కరోనాతో మృతి చెందడంతో మల్కి రెడ్డిని పదవి వరించింది. నిజానికి యర్రబోతుల మృతితో ఆయన కుమారుల్లో ఒకరికి పదవి ఇస్తారన్న ప్రచారం జరగినా ఎవరూ ప్రయత్నాలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన సంజామల జెడ్పీటీసీ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి జెడ్పీ ఛైర్మన్‌ గా ఎన్ననికయ్యారు. జిల్లాలోని నొస్సం గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి తండ్రి జయరామిరెడ్డి మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 

Also Read : ఇచ్చిన మాటకు కట్టుబడి ‘శ్రీనివాసులు’కు పట్టం కట్టిన జగన్

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే జయరామిరెడ్డి ఇంటికి వైఎస్ చాలా సార్లు వెళుతూ ఉండేవారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్‌ వెళ్లే సమయంలో నొస్సంలో ఆగి వెంకట సుబ్బారెడ్డి ఇంట్లో అల్పాహారం చేసేవారని అంటూ ఉంటారు. అలా తన తండ్రి సన్నిహిత కుటుంబానికి జగన్ ఇక్కడ ఛైర్మన్ గిరీ అప్పగించారు. అయితే వెంకట సుబ్బారెడ్డి మాత్రం భూమా నాగిరెడ్డితో కలిసి టీడీపీలో, చల్లా రామకృష్ణారెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో కలిసి వైసీపీలో పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మల్కి రెడ్డి నొస్సం ఉప సర్పంచ్‌గా, సంజామల సహకార సంఘం వైస్‌ చైర్మన్‌గా కూడా పని చేశారు. ఇక శిరివెళ్ల జెడ్పీటీసీ దిల్షాద్‌ నాయక్‌, హొళగుంద జెడ్పీటీసీ కురువ బొజ్జమ్మను వైఎస్‌ చైర్మన్ లుగా ఎన్నికయ్యారు. 

Also Read : బోయ గిరిజమ్మ జెడ్పీ చైర్మన్ కావటానికి నాటి పసుపు కుంకుమ పోరాటమే కారణమా?

Show comments