Venkateswarlu
Venkateswarlu
సిలికాన్ సిటీ బెంగళూరులో ఇళ్లు అద్దెకు దొరకటం చాలా కష్టం. అది కూడా మంచి లొకాలటీలో ఇళ్లు దొరకటం అన్నది అదృష్టం ఉంటే కానీ, సాధ్యపడదు. ఒకవేళ దొరికినా కూడా.. అద్దెలు 20,30 వేల రూపాయల దాకా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఫ్రెండ్స్ కలిసి రూము తీసుకుంటూ ఉంటారు. అయితే, ఓ యువతికి ఈ విషయంలో వింత అనుభవం ఎదురైంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి రూము పేరుతో ఆ యువతితో పులిహోర కలపటానికి చూశాడు. ఆ వివరాల్లోకి వెళితే.. ఆకాంక్ష అనే యువతి బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆకాంక్ష ఇన్‌స్టాగ్రామ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ మెసేజ్ వచ్చింది.
ఆ చాటింగ్ ఇలా సాగింది..
గుర్తు తెలియని వ్యక్తి : గుడ్‌మార్నింగ్.. నేను కూడా మంచి ఏరియాలో.. బడ్జెట్‌కు తగ్గ ఇంటి కోసం చూస్తున్నాను. బెంగళూరులో ఇళ్లు దొరకటం చాలా కష్టంగా ఉంది. మీరు నాతో చెయ్యి కలపడానికి సిద్ధమేనా?
ఆకాంక్ష : లేదు. క్షమించండి. ఫ్లాట్మేట్లను చేసుకోవటంలో నాకు ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా మగాళ్లను..
గుర్తు తెలియని వ్యక్తి : సరే.. ఈ విషయం మిమ్మల్ని అడగటానికి ఇది సరైన వేదిక కాదు. మీరు సింగిల్ అయి ఉండి.. ఓకే అంటే.. ఇద్దరమూ జీవితాలను పంచుకుందామా? పరస్పర గౌరవంతో..
ఇలా ఇద్దరి చాటింగ్ సాగింది. అతడి పెళ్లి ప్రపోజల్‌కు ఆమె రిప్లై ఇవ్వలేదు. ఆ చాటింగ్ దృశ్యాలను స్క్రీన్ షాట్ తీసి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇంటి కోసం చూస్తుంటే ఈ దారుణం జరిగింది అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Perks of house-hunting in Bangalore, you get creeps free but not the house. Desperate house-hunters in Bangalore believing in “make them an offer they can’t refuse” too seriously. @BangaloreRoomi @fmrbangalore @peakbengaluru pic.twitter.com/AN9b9hbeSv
— Akanksha Mishra (@akanksha98353) September 14, 2023