పర్చూరు పై బాలినేని కామెంట్

పర్చూరు విషయంలో కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉంటే బాగుంటుందని సీఎం వైఎస్‌ జగన్‌.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సూచించినట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం దగ్గుబాటిదేనని, ఆయనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. గురువారం అయన ఒంగోలు లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రానున్న వారం రోజుల్లో పర్చూరు విషయంలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కాగా ఇటీవలి ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. 

Show comments