Idream media
Idream media
కరోనా వల్ల ఆర్థికంగా చితికిపోయిన వర్గాలను ఆదుకునే చర్యలు చేపడుతున్న జగన్ సర్కార్‌కు ప్రశంసలందుతున్నాయి. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వివిధ వర్గాల వారికి చేయూతనందించే కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ రోజు చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థిక పోత్సాహకాలను జగన్ సర్కార్ విడుదల చేసింది. 1,124 కోట్ల రూపాయలను చిన్న తరహా పరిశ్రమలకు అందించేలా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్‌ను నొక్కి నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
వరుసగా రెండో ఏడాది కూడా కరోనా ప్రభావం పడడంతో మరోసారి పరిశ్రమలకు ఆర్థికంగా అండగా నిలిచేలా జగన్ సర్కార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత ఏడాది 1,100 కోట్ల రూపాయలను చిన్నతరహా పరిశ్రమలకు అందించిన జగన్‌సర్కార్.. ఈ ఏడాది ఎంఎస్‌ఎంఈలతోపాటు టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్లులకు మరో 1,124 కోట్ల రూపాయల ఆర్థిక పోత్స్రాహం అందిస్తోంది.
తగ్గేదేలేదంటున్న సీఎం జగన్..
కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా దాదాపు 25 పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారులు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కరోనా వల్ల పరిశ్రమలు మూతపడే పరిస్థితి రాకుండా ఉండేందుకే ఈ తరహాలో దాదాపు 97 వేల మంది అండగా ఉంటున్నామని చెప్పారు. చిన్న తరహా కంపెనీలు దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని వివరించారు.
కరోనా నుంచి బయటపడేందుకు ప్రజలు, వివిధ రంగాలు కోలుకునేందుకు ప్రభుత్వాలు ప్రజలకు నగదును అందించాలని ఆర్థిక వేత్తలు చెబుతుండగా.. ప్రతిపక్ష పార్టీ మాత్రం అందుకు భిన్నంగా విమర్శలు చేస్తోందని సీఎం వైఎస్ జగన్ టీడీపీ తీరును ఎండగట్టారు. ప్రజలకు మేలు చేసే పనులపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని. ఏం చేసినా ప్రజలకు మంచి చేసే విషయంలో తగ్గేదేలేదని స్పష్టం చేశారు.
Also Read : ఆ మాజీ మంత్రి పదేళ్ల తరువాత రాజకీయ సన్యాసం చేస్తారంట