చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. ఇండస్ట్రీలో సత్తా చాటిన నటీ, నటులు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా తమదైన ముద్రవేశారు. సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్,జయలలిత దగ్గర నుంచి విజయశాంతి, రోజా, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి మరికొందరు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇంట్లో రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఉండటంతో.. వారి వారసత్వాన్ని వారసులు కొనసాగిస్తారని అందరూ అనుకుంటారు. దీంతో వారికి తరచుగా పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురౌతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి ప్రశ్నలే స్టార్ హీరోయిన్, కమల్ కూతురు శృతిహాసన్ కు ఎదురౌతున్నాయి. ఇక తన పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చింది ముద్దుగుమ్మ.
శృతిహాసన్.. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ నటిగా మారారు. తొలిసారి ఓ హాలీవుడ్ మూవీలో నటిస్తోంది శృతి. ఇక నటిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందన్న వార్త గత కొంతకాలంగా వైరల్ గా మారింది. దానికి కారణం శృతి తండ్రి కమల్ హాసన్ మక్కల్ ఇయక్కం పార్టీ అధ్యక్షుడిగా ఉండటమే. దీంతో వారసురాలిగా ఆమె కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
ఇక ఇదే ప్రశ్నను శృతిహాసన్ ను అడగ్గా.. ఆమె చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. తాజాగా కోయంబత్తూర్ లో మీడియాతో మాట్లాడిన ఆమె పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. జకీయాల్లోకి రావడం నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సినిమాల్లో నటించడంపైనే నాకు ఆసక్తి ఉందని చెప్పుకొచ్చారు శృతిహాసన్. దీంతో ఇప్పటి వరకు ఆమె పొలిటికల్ ఎంట్రీపై వచ్చిన వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. కాగా.. ప్రస్తుతం శృతిహాసన్ నటించిన ‘సలార్’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే తాను రూపొందిస్తున్న ప్రైవేట్ ఆల్బమ్ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. మరి శృతిహాసన్ పొలిటికల్ ఎంట్రీ క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.