Karnataka Crime News: ఐదు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. అసలేం జరిగింది?

ఐదు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. అసలేం జరిగింది?

Karnataka Crime News: ఈ మద్య దేశంలో నేరాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి.. కొన్ని హత్యలు పోలీసులకు సవాళ్లుగా మారుతాయి.. అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

Karnataka Crime News: ఈ మద్య దేశంలో నేరాల సంఖ్య బాగా పెరిగిపోతున్నాయి.. కొన్ని హత్యలు పోలీసులకు సవాళ్లుగా మారుతాయి.. అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

దేశంలో ఈ మద్య  యువత డేటింగ్ కల్చర్ కి బాగా అలవాటు పడ్డారు. ఒకప్పుడు పెద్దలు కుదర్చిన పెళ్లి సంబంధం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేవారు. కానీ ఈ మధ్య పెద్దలు కుదిర్చిన సంబంధాల కన్నా తాము ఇష్టపడే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్నారు. కొంతమంది సహజీవనం పేరుతో లైంగిక వాంఛ తీర్చుకున్న తర్వాత యువతులను దారుణంగా హతమార్చి తప్పించుకుపారిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది ఢిల్లీలో శ్రద్దా వాకర్ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఓ మహిళ శవం తీవ్ర కలకలం రేపింది.. ఈ ఘటన చిక్కనబళ్లాపురంలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు..? ఎలా చనిపోయింది? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

కర్ణాటక.. చిక్కనబళ్లాపురంలో చామరాజు పేటలో ఓ ఇంట్లో మహిళ హత్యకు గురైంది. దాదాపు ఐదు రోజుల తర్వాత ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సెయింట్ కాన్వెంట్ సమీపంలో ఓ ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ఆ ఇంటి యజమాని, స్థానికులు కిటికీలో నుంచి తొంగి చూశారు. లోపల దీప(40) అనే మహిళ అచేతనంగా పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ మొత్తం పరిశీలించి చూశారు. దీప గొంతును ఎవరో బలంగా కత్తితో కోసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇటీవల చామరాజు పేటలో సెయింట్ జోసెఫ్ కాన్వేంట్ సమీపంలో  ఇళ్ల అద్దెకు తీసుకొని మృతురాలు దీప, మల్లికార్జున్ అలియాస్ దివాకర్ కాపురం ఉంటున్నారు. జనాలకు తాము భార్యాభర్తలం అని చెప్పుకునేవారు. తాము ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందినవారిమని ఇంటి యజమాని, స్థానికులకు చెప్పారు. దీప ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది. మల్లికార్జున్ మాత్రం స్థానికంగా ఉన్న షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. ఈ నెల 7 వ తేదీ నుంచి భార్యాభర్తలు బయట కనిపించడం లేదని.. హఠాత్తుగా ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్సీ, డీఎస్పీ సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీప భర్తగా చెప్పుకుంటున్న మల్లికార్జున్ కనిపించకుండా పోయాడు. దీంతో అతనే ఆమెను హత్య చేసిఉంటాడా? లేద ఇంకేదైనా జరిగిందా?అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Show comments