Those buses will be ban from November 1: షాకింగ్ నిర్ణయం.. నవంబర్ 1 నుంచి ఆ బస్సులు బంద్!

షాకింగ్ నిర్ణయం.. నవంబర్ 1 నుంచి ఆ బస్సులు బంద్!

దసరా, దీపావళి పండుగలను ప్రజలు ఎంత ఘనంగా జరుపుకుంటారో మనందరికి తెలిసిన విషయమే. పండుగలను పురస్కరించుకుని ప్రజలు నగరాల నుంచి తమ సొంత ఊర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికులకు షాకిచ్చే వార్త వెలుగులోకి వచ్చింది.

దసరా, దీపావళి పండుగలను ప్రజలు ఎంత ఘనంగా జరుపుకుంటారో మనందరికి తెలిసిన విషయమే. పండుగలను పురస్కరించుకుని ప్రజలు నగరాల నుంచి తమ సొంత ఊర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికులకు షాకిచ్చే వార్త వెలుగులోకి వచ్చింది.

దసరా, దీపావళి పండుగలను ప్రజలు ఎంత ఘనంగా జరుపుకుంటారో మనందరికి తెలిసిన విషయమే. పండుగలను పురస్కరించుకుని ప్రజలు నగరాల నుంచి తమ సొంత ఊర్లకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికులకు షాకిచ్చే వార్త వెలుగులోకి వచ్చింది. నవంబర్ 1 నుంచి ఆ బస్సులను బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ బస్సుల వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని భావించిన అధికారులు వాటిపై పూర్తి నిషేదాన్ని విధించారు. అయితే ఈ నిషేదం మన రాష్ట్రంలో కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆ బస్సులపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో వాయుకాలుష్యం జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. గాలి కాలుష్యం కారణంగా అనారోగ్యాలకు గురవుతున్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమస్య తీరడం లేదు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఫ్యాక్టరీలను మూసివేయడం, సరి బేసి విధానంలో వాహనాలను అనుమతించడం, వాయు కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై నిషేధం విధించడం, బాణసంచా కాల్చడాన్ని అనుమతించకపోవడం ఇలా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే నవంబర్ 1 నుంచి దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో డీజిల్ బస్సులు తిరగడంపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

డీజిల్‌తో నడిచే బస్సులు కాలుష్యానికి కారణమవుతున్నాయని భావించిన నేపథ్యంలో.. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో నవంబర్ 1 నుంచి ప్రయాణించడానికి వీలు లేదని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ప్రకటించింది. కేవలం ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, బీఎస్ 6 డీజిల్ బస్సులను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపింది. ఉన్నట్టుండి డీజిల్ తో నడిచే బస్సులను బ్యాన్ చేయడంతోప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ డీజిల్ వాహనాల తయారీని నిలిపివేయాలని, అధికంగా జీఎస్టీ విధిస్తామని ఆటోమొబైల్ సంస్థలను హెచ్చరించిన విషయం తెలిసిందే.

Show comments