Suresh Poojari: నాడు జ్యూస్ షాపులో రూ.4 కూలి.. నేడు 22 రెస్టారెంట్లకు యజమాని!

ఎవరైనా సరే జీవితంలో ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుని, అందుకు అనుగుణంగా పనిలోకి దిగితే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరని అంటుంటారు. అటువంటి వారిని ఆర్ధిక ఇబ్బందులు కూడా ఏమీ చేయలేవని చెబుతుంటారు. ఆమాటలను నిజం చేశారు కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి.

ఎవరైనా సరే జీవితంలో ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుని, అందుకు అనుగుణంగా పనిలోకి దిగితే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరని అంటుంటారు. అటువంటి వారిని ఆర్ధిక ఇబ్బందులు కూడా ఏమీ చేయలేవని చెబుతుంటారు. ఆమాటలను నిజం చేశారు కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి.

పట్టుదలతో చేసే యుద్ధంలో తప్పక విజయం సాధిస్తారు. అలానే నిరుత్సాహం, నిరాశ దరిదాపుల్లోకి రానివ్వకుండా సంకల్ప బలంతో ముందుకు వెళ్తే.. ఎవరెస్టు శిఖరం కూడా చినబోతుంది. కష్టాలను సాకుగా చూపే వాడికి విజయం ఎప్పుడు ఆమడ దూరంలోనే ఉంటుంది. కష్టాలను సైతం తన విజయ సాధానకు మార్గాలుగా వేసుకునే వారు చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారి జాబితాలోకి చేరిన వ్యక్తే సురేష్ పూజారి. రూ.4 జీతంలో జీవితం ప్రారంభించిన ఆయన నేడు 22 రెస్టారెంట్లకు ఓనర్ గా మారిన సక్సెస్ విధానం గురించి  వింటే ఆశ్చర్యం కలగమానదు.

కర్నాటక రాష్ట్రానికి చెందిన సురేష్ పూజారి ఓ పేద కుటుంబంలో జన్మించాడు. ఆయనకు బాల్యంలోనే అనేక కష్టాలు చుట్టుముట్టాయి. బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరాలని ఆయన భావించారు. కానీ ఆర్థిక పరిస్థితులు ఆయన చదువును కొనసాగించేందుకు సహకరించలేదు. పదేళ్ల వయసులోనే సురేష్ పూజారి కూలీగా మారాడు., ఊరిలో పనులు దొరక్కపోవడంతో  ముంబై నగరానికి పయనమయ్యాడు. 1950 సమయంలో సురేష్ ముంబైకి వెళ్లారు. అక్కడి వాతావరణం, పరిస్థితుల గురించి పెద్దగా తెలియకపోయినా ఎలాగోలా ఓ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న చిన్న దాబాలో ఉద్యోగం పొందాడు. రోజంతా పని చేస్తే.. నెలకు నాలుగు రూపాయలను సురేష్ కు జీతంగా ఇచ్చే వారు.

ఆ దాబాలో రెండేళ్లు పని చేసిన తరువాత ఆయనకు తెలిసిన వ్యక్తి జ్యూస్ షాపులో ఉద్యోగం ఇప్పించాడు. జీతం పెద్దగా పెరగలేదు, కానీ పనిలో నైపుణ్యాలను నేర్చుకున్నాడు. ఆతరువాత క్యాంటీన్ లో ఉద్యోగం పొందాడు. ఇదే సమయంలో చదువులేక పోతే ఇబ్బందని గ్రహించి..  పని చేసుకుంటూనే రాత్రిపూట స్కూల్స్  వెళ్లే వాడు. అలా 9వ తరగతి వరకు చదువుకున్నాడు. పని చేస్తూ తాను సంపాదించిన కొద్ది పాటి డబ్బులతో సురేష్‌ ఒక చిన్న పావ్ భాజీ దుకాణాన్ని తెరిచాడు. తదనంతర కాలంలో సురేష్‌ తయారు చేసే పావ్‌ భాజీకి జనం నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. దీంతో ఆయన క్రమంగా తన బిజినెస్ ను విస్తరించారు.

కొద్ది కాలంలోనే అతని షాపులను దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. నాడు నాలుగు రూపాయలతో జీవితం ప్రారంభించిన సూరేష్ ఎవరికి తెలియకపోవచ్చు. కానీ, నేడు ఆయన నెలకొల్పిన ‘సుఖ్ సాగర్’ రెస్టారెంట్ల గురించి తెలియనివారుండరు. దేశంలో 22కు పైగా సుఖ్‌ సాగర్‌ రెస్టారెంట్ బ్రాంచీలు ఉన్నాయి. ఐస్‌క్రీమ్‌ పార్లర్‌, షాపింగ్‌ మాల్‌, త్రీస్టార్‌ హోటల్‌ యజమానిగా సురేష్‌ పూజారి మారారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకుంటూ, బిజినెస్ లో సక్సెస్ సాధించిన సురేష్ పూజారి యువతకు ఆదర్శప్రాయుడు. మరి.. సురేష్ పూజారిపై సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments