Arjun Suravaram
Heavy Rain In Delhi: గతకొన్ని రోజుల నుంచి ఢిల్లీ నగర ప్రజలు దంచికొడుతున్న ఎండలకు ఉక్కిరికిబిక్కిరి అయ్యారు. ఇక నీటి కోసం తీవ్ర నరకం అనుభవించారు. కానీ గురువారం ఒక్కసారిగా అక్కడి పరిస్థితి మారిపోయింది.
Heavy Rain In Delhi: గతకొన్ని రోజుల నుంచి ఢిల్లీ నగర ప్రజలు దంచికొడుతున్న ఎండలకు ఉక్కిరికిబిక్కిరి అయ్యారు. ఇక నీటి కోసం తీవ్ర నరకం అనుభవించారు. కానీ గురువారం ఒక్కసారిగా అక్కడి పరిస్థితి మారిపోయింది.
Arjun Suravaram
దేశంలోని చాలా ప్రాంతాల్లో కనీసం అప్పుడప్పుడు వానాలు పలకరించాయి. అయితే దేశ రాజధాని నగరంలో మాత్రం కొన్ని నెలలుగా తీవ్రమైన ఎండలు, వేడిగాలుకు వీచాయి. దీంతో ఢిల్లీ నగర ప్రజలు అల్లాడిపోయారు. గురువారం మధ్యాహ్నం వరకు కూడా ఎండలు దంచికొట్టాయి. ఇక అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. గురువారం కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ మొత్తం వరద నీటిలో చిక్కుకుంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఈ నేపథ్యంలోనే 88 ఏళ్లనాటి రికార్డును బద్దలు కొడుతూ ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది.
గతకొన్ని రోజుల నుంచి ఢిల్లీ నగర ప్రజలు దంచికొడుతున్న ఎండలకు ఉక్కిరికిబిక్కిరి అయ్యారు. ఇక నీటి కోసం తీవ్ర నరకం అనుభవించారు. అలాంటి గురువారం నాడు అకస్మాత్తుగా ఢిల్లీ ప్రాంతంలోని వాతావరణం మార్పులు వచ్చాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీ ఎన్ సీఆర్ పరిధిలోని 235.5మి.మీ మేర వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇన్నేళ్ల నుంచి జూన్ నెలలో ఒక్కరోజులో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ నగరంలో 1936లో భారీ స్థాయిలో వాన కురిసిందని. తాజాగా 88 ఏళ్ల తరువా ఆ రికార్డును బదలకొట్టిందని వాతావరణ శాఖ తెలిపింది. 1936 నుంచి జూన్ నెలలో ఒకరోజులో నమోదైన అత్యధిక వర్షపాతమని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణంగా ఢిల్లీలో ఏటా జూన్‌లో సగటున 80.6 మి.మీ వర్షపాతం కురుస్తుంది.
#WATCH | Delhi: Roads inundated as heavy rain continues in parts of National Capital
(Visuals from Govindpuri) pic.twitter.com/9idnGwx0nb
— ANI (@ANI) June 28, 2024
అయితే ఈసారి అది ఏకంగా 235.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఢిల్లీ వాసులు వరద ముంపు గురయ్యారు. ఇక భారీ వాన కురువడంతో ఢిల్లీలో తీవ్రంగా ట్రాఫిక్ ఏర్పడింది. అంతేకాక పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా నమోదవుతున్న భారీ ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయని ఐఎండీ పేర్కొంది. శుక్రవారం ఢిల్లీలో 24.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని.. ఇది సాధారణం కన్నా 3.2 డిగ్రీలు తక్కువని తెలిపింది. కేవలం ఒక్కరోజు వానకే ఢిల్లీలో వసతులు, సౌకర్యాలు లేమి కనిపిస్తోంది. ఇక శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు కుంభవృష్టి కురిసింది. ఈ 3 గంటల వ్యవధిలోనే ఢిల్లీలో 150 మి.మీ పైగా వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులన్ని జలమయమయ్యాయి.
#WATCH | A car submerged in water and roads heavily flooded due to continuous downpour in Delhi
(Visuals from Minto Road) pic.twitter.com/reJQPlzfbQ
— ANI (@ANI) June 28, 2024