సామానుడ్యిలా మాజీ ముఖ్యమంత్రి అంత్యక్రియలు!

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ(79) గత కొన్ని నెలలుగా కాన్సర్ వ్యాధితో బాధపడుతూ బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో మంగళవారం తుదిశ్వాశ విడిచిన సంగతి తెలిసిందే. క్యాన్సర్‌తో తీవ్రంగా బాధపడుతున్న ఆయన కొన్ని నెలల క్రితం చికిత్స కోసం జర్మనీకి కూడా వెళ్లొచ్చారు. అక్కడికి వెళ్లొచ్చిన కొద్ది రోజులకే ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతుండగా మంగళవారం తెల్లవారుజామున 4.25 గంటలకు తుది శ్వాస విడిచారు.

 ఉమెన్ చాందీ రెందు సార్లు కేరళ ముఖ్యమంత్రిగా పని చేశారు. అంతేకాకుండా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈరోజు మధ్యాహ్నం ఊమెన్ చాందీ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే అధికార లాంఛనాలతో కాకుండా సామాన్య పౌరుడిలా ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అది ఆయన చివరి కోరిక అని తెలిపారు. దాన్ని నెరవేర్చుతామని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. దీనిపై ఉమెన్‌ చాందీ కుమారుడు మాట్లాడుతూ..

‘‘గత ఏడాది చికిత్స కోసం జర్మనీకి వెళ్లేముందు తన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించరాదని అమ్మకి చెప్పారు. కొట్టాయం జిల్లాలోని పుథుపల్లి చర్చిలో నిర్మించిన సమాధిలో మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం ఖననం చేస్తా’’ అని తెలిపాడు. ఇక, క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారమే అంత్యక్రియలు జరుగుతాయని సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల తెలిపారు. ఉమెన్ చాందీ మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో తిరువనంతపురం నుంచి కొట్టాయంకు తరలించారు. జనాలు చివరి చూపు చూడడానికి భారీగా తరలి వచ్చారు.

Show comments