ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త చేసిన పనికి ప్రతి ఒక్కరు షాక్‌!

ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త చేసిన పనికి ప్రతి ఒక్కరు షాక్‌!

కొన్నాళ్ల క్రితం వకు భారతీయ వివాహ వ్యవస్థ అంటే ప్రంపచ దేశాలు సైతం ఎంతో గౌరవంగా చూసేవి. అగ్నిసాక్షిగా పడ్డ మూడు ముళ్లకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. కట్టే కాలే వరకు ఆ బంధానికి కట్టుబడి ఉండేవారు. కానీ నేటి కాలంలో పెళ్లి అంటే.. నిజంగానే బొమ్మలాట అయిపోయింది కొందరికి. తాళిని ఎగతాళి చేస్తూ.. అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణాలను గాలికి వదిలేసి.. ఏడడుగుల బంధాన్ని ముక్కలు చేసి.. పెళ్లి తర్వాత కూడా ప్రేమ వ్యవహరాలను నడిపే వారి సంఖ్య పెరుగుతోంది. తమ సుఖం కోసం జీవత భాగస్వామిని మాత్రమే కాక పిల్లలను సైతం వదిలి వెళ్లిపోతున్నారు. మరికొందరైతే చంపడానికి కూడా వెనకాడటం లేదు. అయితే ఇలాంటి దారుణాల మధ్య అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. భార్య మరో వ్యక్తిని ప్రేమించిందని తెలుసుకున్న భర్త.. షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు..

ఈ విచిత్ర సంఘటన ఒడిశా, కటక్‌లో చోటు చేసుకుంది. సోన్‌పూర్‌ జిల్లా శుభలాయి ఠాణా పరిధిలోని కిరాసి గ్రామానికి చెందిన మాధవ ప్రధాన్‌ అనే వ్యక్తికి మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. అనుగుల్‌ ప్రాంతానికి చెందిన జిల్లి అనే మహిళను మాధవ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు వీరి కాపురం సవ్యంగానే సాగింది. ఇలా ఉండగా కొన్నాళ్ల నుంచి జిల్లి.. తనకు దూరపు బంధువైన పరమేశ్వర ప్రధాన్‌తో సన్నిహితంగా ఉండసాగింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. విడిపోయి ఉండటం కష్టం అని భావించారు. దాంతో ఇద్దరు కలిసి గురువారం ఇంట్లో నుంచి పరారయ్యారు.

భార్య ఇంట్లో లేకపోవడంతో మాధవ దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త కంప్లైంట్‌ మేరకు పోలీసులు జిల్లి కోసం గాలించడం ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లి, ఆమె ప్రియుడు ప్రధాన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపాలని భావించారు పోలీసులు. కానీ జిల్లి తాను తన భర్త దగ్గరికి వెళ్లనని.. ప్రధాన్‌తోనే కలిసి ఉంటానని తెగేసి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న మాధవ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతడు చేసిన పనికి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంతకు మాధవ ఏం చేశాడంటే.. భార్య జిల్లికి ఆమె ప్రియుడిని ఇచ్చి వివాహం చేశాడు. మాధవ తీసుకున్న నిర్ణయంపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది మాత్రం మంచి పని చేశాడు. లేదంటే వారి చేతిలో చనిపోవాల్సి వచ్చేది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Show comments