IPL మనకి ఫ్రీగా చూపిస్తూనే రూ.4000 కోట్ల ఆదాయం! ఇది అంబానీ స్ట్రాటజీ!

Jio Cinema: ప్రస్తుతం ఐపీఎస్ సీజన్ 17 నడుస్తున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ లన్నీ హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జియో సినిమా ద్వారా ఐపీఎల్‌ను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. రిలయన్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో క్రికెట్ ప్రేమికులంతా 'హ్యాపీ'గా ఉన్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక అంబానీ స్ట్రాటజీ వేరే ఉందని టాక్.

Jio Cinema: ప్రస్తుతం ఐపీఎస్ సీజన్ 17 నడుస్తున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ లన్నీ హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జియో సినిమా ద్వారా ఐపీఎల్‌ను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. రిలయన్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో క్రికెట్ ప్రేమికులంతా 'హ్యాపీ'గా ఉన్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక అంబానీ స్ట్రాటజీ వేరే ఉందని టాక్.

రిలయన్స్ గ్రూప్స్ అధినేత ముఖేశ్ అంబానీ గురించి  ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన వ్యాపార రంగంలో  ఓ ధృవతార. ప్రపంచ కుబేరుల్లో ముఖేశ్ అంబానీ వరకు. పెట్రోకెమికల్ నుండి గ్రీన్ ఎనర్జీ వరకు వివిధ పరిశ్రమలలో ఇవి ఉన్నాయి. అలానే రిలయన్స్ టెలికాం, మీడియ ఎంటర్ టైన్మెంట్ లోకి కూడా అడుగు పెట్టి.. దూసుకెళ్తోంది. ముకేశ్ అంబానీ బీసీసీఐ నుంచి ఐపీఎల్ హక్కులను పొందారు. ఆ తర్వాత జియో సినిమా ద్వారా ఐపీఎల్‌ను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. రిలయన్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో క్రికెట్ ప్రేమికులంతా ‘హ్యాపీ’గా ఉన్నారు. అయితే చాలా మంది ఉచితంగా ఐపీఎల్ చూపిండచం ఏంది అని అనుకుంటారు. కానీ ఈ నిర్ణయంతో ముఖేష్ అంబానీ కూడా లబ్ధి పొందుతున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం ఐపీఎస్ సీజన్ 17 నడుస్తున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ లన్నీ హోరాహోరీగా సాగుతున్నాయి. చాలా పలు ఓటీటీ సబ్ ఖాతాలు లేని వారు  ఐపీఎల్ ను చూడటం మిస్సతవుతున్నారు. అలాంటి వారి కోసం జియో సినిమాలో ఐపీఎల్ మ్యాచ్ లను ఉచితంగా చూపిస్తుంది రిలయన్స్ సంస్థ. ఈ క్రమంలోనే వయాకామ్ 18 ద్వారా 5 ఏళ్ల పాటు ఐపీఎల్ డిజిటల్ హక్కులను రిలయన్స్ సొంతం చేసుకుంది. 23,758 కోట్ల రూపాయలకు ఈ హక్కును సొంతం చేసుకున్నారు. అంటే ఏటాది 4,750 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఐపీఎల్‌ని ఉచితంగా  ఎందుకు చూపిస్తున్నారని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు.

అసలు ఇలా ఉచితంగా ఐపీఎల్ చూపించడం వెనుక ముఖేష్ అంబానీ లాంగ్ టర్మ్ ఆలోచన ఏంది అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జియో లో ఉచిత ఐపీఎల్ మ్యాచ్‌లు చూపించడం వల్ల ముఖేష్ అంబానీకి నష్టం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో కేవలం ప్రకటనల ద్వారా 4000 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు ముఖేష్ అంబానీ. వారు దూరదృష్టితో జియో సినిమాలో ఇచ్చే ప్రకటనల రేట్లను తక్కువగా ఉంచారు. ఈ దీంతో ప్రకటనలు ఇచ్చే వారు కూడా తక్కువ రేట్లు కావడంతో రిలయన్స్ తో ఎక్కువ కాలం అగ్రిమెంట్ ను కొనసాగిస్తారు. ఆ విధంగానే గతేడాది కేవలం ప్రకటనల ద్వారానే రూ.3239 కోట్లను రిలయన్స్ జియో ఆర్జించింది. ఈ ఏడాది  ఆ ఆదాయం రూ.4 వేల కోట్లకు చేరనుంది.

కొన్ని నివేదికల ప్రకారం.. ఐపీఎల్‌ ప్రచారానికి 18 మంది స్పాన్సర్లు, 250 మంది ప్రకటనదారులు ఉన్నారు. డ్రీమ్-11, పార్లే, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి పలు బ్రాండ్‌లు ఉన్నాయి. జియో ఈ బ్రాండ్ స్పాట్‌లైట్ల నుండి ఆదాయాన్ని అర్జిస్తుంది. అలాగే ప్రజలు చాలా డేటాను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా కూడా జియో సంపాదిస్తుంది. అదనపు డేటా కారణంగా మొబైల్ యజమాని ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలా మొత్తంగా అంబానీ అదిరిపోయే ప్లాన్ వేసి.. భారీ ఆదాయాన్ని అర్జిస్తున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయా పడుతున్నారు.

Show comments